Viral: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.. తీరా పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్!
ఇంట్లో వంట వండుకునేందుకు బద్దకమేసి.. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఐదు.. పది.. పావు గంట.. అరగంట..
ఇంట్లో వంట వండుకునేందుకు బద్దకమేసి.. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఐదు.. పది.. పావు గంట.. అరగంట.. ఇంటికొచ్చిన పార్శిల్‌ను విప్పి చూడగా ఒక్కసారిగా అతడి మైండ్ బ్లాంక్ అయింది. ఫుడ్‌తో పాటు వచ్చిన ప్యాకెట్ చూసి కళ్లు తేలేసాడు.. ఇంతకీ ఆ కథేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి డోర్ డాష్(Door Dash) అనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. తీరా ఇంటికొచ్చిన పార్శిల్‌ను విప్పి చూడగా.. డెలివరీ బ్యాగ్‌లో ఫుడ్‌తో పాటు గంజాయి ప్యాకెట్ దర్శనమిచ్చింది. దీనితో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన ఆగష్టు 9వ తేదీన జరిగింది. ఇక ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఆ గంజాయి ప్యాకెట్ కోసం డెలివరీ బాయ్ బాయ్ మళ్లీ సదరు వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు. అది తన స్నేహితుడికి మందు అని చెప్పి.. దాన్ని ఇవ్వమని కోరాడు.
అయితే సదరు వ్యక్తి ఆ గంజాయి ప్యాకెట్‌ను డెలివరీ బాయ్‌కు ఇవ్వకుండా.. పోలీసులకు సమాచారాన్ని అందించాడు. అనంతరం డోర్ డాష్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు కస్టమర్ కంప్లయింట్‌కు డోర్ డాష్ సంస్థ స్పందించింది. ఇలాంటి చర్యలను తమ సంస్థ అస్సలు క్షమించబోదని.. వెంటనే సదరు డెలివరీ ఏజెంట్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..
ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..