Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. మీ ఐ పవర్ కిర్రాక్ ఉన్నట్లే!

ఈ పజిల్స్ వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్ లాంటివి అనుకోవద్దు. ఇవి మీ మెదడు చురుకుదనాన్ని..

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. మీ ఐ పవర్ కిర్రాక్ ఉన్నట్లే!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 16, 2022 | 6:30 PM

ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామందికి పజిల్స్ అంటే ఇష్టముంటుంది. ఒక్కసారిగా వాళ్ళకు ఇలాంటివి కనబడితే చాలు.. వాటిని అంతు చూడకుండా వదిలిపెట్టరు. ఈ పజిల్స్ వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్ లాంటివి అనుకోవద్దు. ఇవి మీ మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాదు.. కళ్ళకు పదును కూడా పెడతాయి. ‘ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి’.. ‘ఈ ఫోటో సింహం ఉంది’ లాంటి ఫోటో పజిల్స్ మీరూ చూసే ఉంటారు.

వీటిని సాల్వ్ చేయడం అంత సులువు కాదు.. మీరు మేధావులు అయితేనే వీటిని ఓ పట్టు పట్టగలరు.. లేదంటే ఇవి మిమ్మల్ని మభ్యపెట్టేస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట సర్క్యులేట్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అది ఎండిన ఆకులు, కొమ్మల రంగులో కలిసిపోవడంతో.. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. 15 సెకన్లలో ఫోటోలోని పామును కనిపెడితే.. మీరే తోపు అని ఒప్పుకోవాలి. ఒకవేళ ఎంత వెతికినా పాము దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..