Viral Video: డ్రైవింగ్ చేస్తుండగా కాళ్లకు తగిలిన వస్తువు.. అనుమానమొచ్చి చూడగా..
మీరెప్పుడైనా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నప్పుడు..? లేదా ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడు..? అనుకోని సంఘటన జరిగితే..
మీరెప్పుడైనా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నప్పుడు..? లేదా ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడు..? అనుకోని సంఘటన జరిగితే.. అప్పుడెలా ఉంటుంది.! ఏంటి ఈ పిచ్చి ప్రశ్న..! అలాంటిది ఏమైనా జరిగిందంటే.. ఎవ్వరైనా కూడా షాక్‌కు గురవుతారన్నదే మీ ఆన్సర్ కదూ.. కరెక్టేనండీ అందరి రియాక్షన్ కూడా అదే. ఇక్కడ మేము చెప్పబోయే స్టోరీ వింటే మీరూ షాక్ కావడం ఖాయం..
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో చాలా ప్రాంతాల్లో వీకెండ్ అయితే చాలు.. లాంగ్ ట్రిప్‌లకు వెళ్తుంటారు. అలాగే ఓ కపుల్ కూడా తమ వ్యాన్‌లో లాంగ్ ట్రిప్‌కు బయల్దేరారు. డ్రైవింగ్ చేస్తుండగా.. తన కాళ్లకు ఏదో వస్తువు తగిలినట్లు భర్త గ్రహించాడు. అది ఏమై ఉంటుందని చూడగా.. దెబ్బకు దడుసుకున్నాడు. ఆ భార్యాభర్తలను షాక్‌కు గురి చేసేలా సుమారు 3.5 అడుగుల పొడవైన పాము వ్యాన్‌లో నక్కి ఉంది. వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్‌కు అందించడంతో.. వారు స్పాట్‌కు చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు తమ సామాజిక మాధ్యమాల్లో వీడియోను అప్‌లోడ్ చేశారు. కాగా, రెడ్ బెల్లీడ్ బ్లాక్ స్నేక్‌లు ఎక్కువగా తూర్పు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. దీని విషం తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందట. అయితే ఇప్పటిదాకా.. ఈ పాము వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..
ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..