Viral Video: వీడు మామూలోడు కాదు.! సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. ఏం తీశాడో తెలిస్తే షాకే.!
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. సాధారణంగా మనం ఏదైనా...
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. సాధారణంగా మనం ఏదైనా వంటకం చేస్తున్నప్పుడు.. సలసలా కాగే నూనె నుంచి దాన్ని తీసుకునేందుకు ఏదైనా స్పూన్ లేదా గరిటెను ఉపయోగిస్తాం. అయితే మీరెప్పుడైనా చేత్తో నూనెలోని వంటకాన్ని తీయడం చూశారా.? అదేంటో నూనెలో చెయ్యి పెడితే కాలిపోతుంది.. అలా ఎలా తీస్తామని ఆలోచిస్తున్నారా.! అయితే ఇక్కడ ఓ పెద్దాయన వేడి నూనెలో చెయ్యి పెట్టి మరీ చికెన్‌ను బయటికి తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పెద్దాయన సలసలా కాగే నూనెలో చెయ్యిని ముంచి ఫ్రై అయిన చికెన్‌ను ఒక్కొక్కటిగా బయటికి తీశాడు. ఇక అలా పెద్ద మూకుడులో నుంచి తీసిన చికెన్‌కు మసాలు అద్దాడు. ఈ వీడియోను ‘nonvegfoodie’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు 1.3 మిలియన్ వ్యూస్, 41 వేల లైకులు వచ్చిపడ్డాయి.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పెద్దాయన చర్యను చూసి కొంతమంది ఆశ్చర్యపోగా.. మరికొందరు పరిశుభ్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ‘క్లీన్ ఫుడ్ సర్వ్ చేయండి డ్యూడ్” అంటూ ఒకరి కామెంట్ చేయగా.. ‘వేడి నూనెలో చెయ్యి కాలిపోకుండా ఉండేందుకు ఏదైనా వస్తువు లాంటిది వాడినట్లు ఉన్నారని’ మరికొందరు కామెంట్ చేశారు.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??