Viral Video: ఫోన్ మైకంలో ఉండగా.. ప్యాంటులోకి దూరిన ఎలుక.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో
Shopkeeper - Rat Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.. తాజాగా
Shopkeeper – Rat Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.. తాజాగా వైరల్ అయిన వీడియోలో.. ఓ దుకాణాదారుడు.. పడుకొని.. తాపీగా విశ్రాంతి తీసుకుంటుంటాడు. కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటుంటాడు. ఈ క్రమంలో అతనికి పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దుకాణదారుడి దుస్తులను బట్టి చూస్తే ఆ వ్యక్తి పాకిస్థానీ అని తెలుస్తోంది. దుకాణదారుడు పఠానీ వేషధారణలో.. చాప మీద నేలపై పడుకుని.. వీడియో కాల్‌లో మాట్లాడుతూ నవ్వుకుంటున్నాడు. అటుఇటు కదులుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. సరిగ్గా ఈ సమయంలోనే అతని పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఎలుక పరిగెత్తకుంటూ వచ్చి నేరుగా అతని ప్యాంటులోకి దూరుతుంది. వెంటనే తన ప్యాంటులోకి ఏదో దూరినట్లు గ్రహించిన దుకాణదారుడు లేచి ప్యాంటును దులుపుకుంటాడు. కానీ.. ఎలుక మాత్రం బయటకు రాదు. ఇక లాభం లేదనుకున్న దుకాణాదారుడు తన ప్యాంటు నాడాను విప్పుతాడు. దీంతో ప్యాంటులోకి దూరిన ఎలుక కిందకు దూకుతుంది. వెంటనే ఊపిరి పీల్చుకున్న దుకాణదారుడు ప్యాంటును మళ్లీ వేసుకుంటాడు. వైరల్ వీడియో..
— UncleRandom (@Random_Uncle_UK) November 5, 2021
హ్యాపీ మూడ్‌లో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఎలుక చేసిన పనికి దుకాణదారుడు.. నిరుత్సాహపడతాడు. అయితే.. ఈ ఘటన సమయంలో అతని హావభావాలను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. బ్రేక్ డ్యాన్సులా.. స్టైల్‌గా గెంతడం చూసి నెటిజన్లు.. అయ్యో ఎంత కష్టం వచ్చిపడిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరగాలా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను అంకుల్ ర్యాండమ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Also Read: