Viral Video: కదులుతుంటే ఆటో టైర్‌ని మార్చిన వ్యక్తి.. ఇలాంటి టాలెంట్ భారతీయులకు మాత్రమే సొంతం

ఈ వీడియోలో రోడ్డుమీద ఆటో వేగంగా నడుపుతున్నారు.. ఇంట్లో డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ఒక వైపుకు ఎత్తి గాలిలోకి లేపి పట్టుకున్నాడు. మరొక వ్యక్తి వేగంగా టైర్‌కి ఉన్న బొల్ట్స్ విప్పి.. చక్రాన్ని తీశాడు. ఇంతలో, మరొక ఆటో అక్కడకు చేరుకుంది. దానిలో ప్రయాణిస్తున్న ఒక బాలుడు పంక్చర్ అయిన ఆటో ఉన్న వ్యక్తికి మరొక టైర్ ను అందజేశాడు. అతని నుండి పంక్చర్ అయిన టైర్ను తీసుకున్నాడు

Viral Video: కదులుతుంటే ఆటో టైర్‌ని మార్చిన వ్యక్తి.. ఇలాంటి టాలెంట్ భారతీయులకు మాత్రమే సొంతం
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2023 | 9:45 AM

ప్రపంచంలో అరుదైన ప్రతిభ కలిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కొన్నిసార్లు ఏదో ఒక విధంగా  ఏదొక సందర్భంలో తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తారు. అలాంటి ఒక వ్యక్తి  వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు చూపరులకు భయాందోళనలను కలిగిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కదులుతున్న ఆటో టైరును మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంత అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. సాధారణంగా వ్యక్తుల కారు పంక్చర్ అయినప్పుడు నేరుగా పంక్చర్ షాప్‌కి వెళ్లడం లేదా కారును ఆపి ముందుగా దాని టైర్ మార్చడం, ఆ తర్వాత కారును ముందుకు కదిలించడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా కదులుతున్న ఆటోని ఒక వైపుకి నిలబెట్టి డ్రైవ్ చేస్తూ  టైర్‌ని ఇలా మార్చడం మీరు చాలా అరుదుగా చూస్తారు.

ఈ వీడియోలో రోడ్డుమీద ఆటో వేగంగా నడుపుతున్నారు.. ఇంట్లో డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ఒక వైపుకు ఎత్తి గాలిలోకి లేపి పట్టుకున్నాడు. మరొక వ్యక్తి వేగంగా టైర్‌కి ఉన్న బొల్ట్స్ విప్పి.. చక్రాన్ని తీశాడు. ఇంతలో, మరొక ఆటో అక్కడకు చేరుకుంది. దానిలో ప్రయాణిస్తున్న ఒక బాలుడు పంక్చర్ అయిన ఆటో ఉన్న వ్యక్తికి మరొక టైర్ ను అందజేశాడు. అతని నుండి పంక్చర్ అయిన టైర్ను తీసుకున్నాడు. ఇదంతుల కదులుతున్న ఆటోల్లోనే జరగడం విశేషం. అప్పుడు ఆ వ్యక్తి త్వరగా టైర్‌ని పంక్చర్ అయిన టైర్ ప్లేస్ లో అమర్చడం ప్రారంభించాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదంతా జరుగుతున్న సమయంలో ఆటో వన్-వే మలుపులు తిరుగుతూ రోడ్డుపై నడుస్తూనే ఉంటుంది. అయితే సాధారణంగా వాహనం బోల్తా పడుతుందనే భయంతో ఏ డ్రైవరూ కదుపుతున్న వాహనం టైర్ ని మార్చే సాహసం చేయరు. ఇది నిజంగా అద్భుతమైన ప్రతిభ .

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 8 లక్షల 23 వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడిన desi_rajsthani_vlogs అనే IDతో Instagramలో భాగస్వామ్యం చేయబడింది. 60 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ‘ఆటో పడిపొతే డ్రైవర్‌ కు ఎంత ప్రమాదం జరిగేది అని కామెంట్ చేయగా..  ‘ఇలాంటి కొడుకును కన్న తల్లి ధన్యురాలు’ అని మరొకరు రాశారు.  అంతేకాదు ఇలాంటి టాలెంట్ భారతీయుల సొంతం అని భారతదేశంలో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని కామెంట్ చేశారు అంతేకాదు ‘మాకు కూడా అలాంటి డ్రైవర్ అవసరం’ ఉందని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే