Farmer – Helicopter: ఎరువు చల్లేందుకు హెలికాప్టర్.. రూ.7 కోట్లతో రైతు కొనుగోలు..
పొలంలో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లు వాడుతున్నారు రైతులు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాకు చెందిన రైతు రాజారాం త్రిపాఠి తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు 7 కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొంటున్నారు .
పొలంలో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లు వాడుతున్నారు రైతులు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాకు చెందిన రైతు రాజారాం త్రిపాఠి తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు 7 కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొంటున్నారు . హాలండ్‌కు చెందిన రాబిన్సన్ కంపెనీ ఆర్-44 మోడల్ హెలికాప్టర్‌ను ఇటీవల బుక్ చేసారు. పురుగు మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు అనుగుణంగా తయారు చేయించుకుంటున్నారు.
రాజారాం ఇంగ్లండ్, జర్మనీలో పర్యటించినప్పుడు ఎరువుల పిచికారీకి హెలికాప్టర్ల వినియోగాన్ని చూశారు. తన కుమారుడిని అలాగే తమ్ముడిని ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీకి పంపి పైలెట్ శిక్షణ ఇప్పించనున్నారు. బస్తర్‌కు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజారాం 1998లో తన బ్యాంకు ఉద్యోగం వదిలేసి రైతుగా మారారు. ప్రస్తుతం బస్తర్, కొండగావ్ జిల్లాల్లో అత్యధికంగా తెల్లముస్లి, నల్ల మిరియాలు పండించడంతోపాటు హెర్బల్ సంస్థ ను నిర్వహిస్తున్నారు. 400 మంది గిరిజన కుటుంబాలతో వెయ్యి ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. తన సంస్థ ద్వారా ఏడాదికి 25 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. యూరోప్, అమెరికా దేశాలకు నల్ల మిరియాలు ఎగుమతి చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

