Woman on Railway Track: పట్టాలపై స్పృహ తప్పిన మహిళ.. ఆ తర్వాత ఏమైందంటే.?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఓ మహిళ స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. అదే సమయంలో ఓ గూడ్సు రైలు ట్రాక్‌పై నుంచి వెళ్లినా.. ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఓ మహిళ స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. అదే సమయంలో ఓ గూడ్సు రైలు ట్రాక్‌పై నుంచి వెళ్లినా.. ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాబూపుర్ గ్రామానికి చెందిన హరి ప్యారీ అనే 40 ఏళ్ల మహిళ.. మందులు కొనేందుకు సహవర్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు అకస్మాత్తుగా తల తిరిగి.. స్పృహతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. హరి ప్యారీని రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు తీసేందుకు కొందరు వ్యక్తులు పరుగెత్తారు. అప్పటికే ఓ గూడ్సు రైలు అదే లైన్‌లో వచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు. కొన్ని బోగీలు హరి ప్యారీ పైనుంచి వెళ్లేసరికి ఆమెకు మెలకువ వచ్చింది. కాళ్లు, చేతులు కదలకుండా ఉండాలంటూ స్థానికులు కేకలు వేశారు. రైలు వెళ్లాక.. స్థానికులు ఆమెను ట్రాక్‌పై నుంచి పక్కకు తీశారు. హరి ప్యారీకి స్వల్ప గాయాలయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

