Digital beggar: డిజిటల్ బిచ్చగాడు..చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన.. వీడియో వైరల్.
మనం ప్రతిరోజు నాలుగు రోడ్ల కూడలిలో లేదా రైల్లో బిచ్చగాళ్లను చూస్తుంటాం. సాధారణంగా రైళ్లలోని యాచకులు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తుంటారు. కొందరు చేతిలో ఏదైనా పాత్ర పట్టుకొని భిక్ష అడుగుతుంటారు. అయితే ఇది డిజిటల్ యుగం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో కదులుతున్న రైల్లో ఒక బిచ్చగాడు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తున్నాడు. అయితే అతడి ముందుచూపును మాత్రం మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే సాధారణంగా అందరూ భిక్ష వేయరు. ఛేంజ్ లేదనో, లేక మరో కారణంతోనే వారిని తిప్పి పంపేస్తుంటారు. అందుకే అతను వినూత్నంగా ఆలోచించాడు. దాతలనుంచి ఛేంజ్ లేదనే సమాధానం రాకుండా తన చేతిలో క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డు పట్టుకుని ధర్మం చేయాలంటూ వేడుకుంటున్నాడు. రైలులో ఉన్న ఓ వ్యక్తి ఈ భిక్షాటన తీరును రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. ఆ బిచ్చగాడి దూరదృష్టికి ప్రయాణికులు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. కొందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...