Viral Video: నీ ధైర్యానికి దండమే బాబు.. మొసలికి చుక్కలు చూపించిన చిన్న కుక్కపిల్ల. వీడియో వైరల్
మొసళ్ళు నీటిలో కొండచిలువలు, సింహాలపై దాడి చేయడం మనం తరచుగా వీడియోల్లో చూస్తూనే ఉంటాం. కోల్డ్ బ్లడెడ్ ఆక్వాటిక్ సరీసృపాలు, మొసలి నీటిలో లేదా సమీపంలో నివసిస్తుంది.
మొసలి నీళ్లలో ఉంటె దాని బలం ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. ఏనుగును సైతం మట్టుపెడుతుంది మొసలి. అదే నేలపైకి వస్తే మాత్రం అది అంత బలంగా ఉండదు. దానిదగ్గరకు వస్తేనే అది వేటాడుతుంది. తప్ప వేగంగా కదలదు. ఇక మొసళ్ళు నీటిలో కొండచిలువలు, సింహాలపై దాడి చేయడం మనం తరచుగా వీడియోల్లో చూస్తూనే ఉంటాం. కోల్డ్ బ్లడెడ్ ఆక్వాటిక్ సరీసృపాలు, మొసలి నీటిలో లేదా సమీపంలో నివసిస్తుంది. కానీ అవి భూమి మీద గుడ్లు పెడతాయి. పరిసర ఉష్ణోగ్రతతో వాటి శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. మొసలి పొలుసులు చాలా కఠినమైనవి. అవి దాదాపు ఐదు మీటర్ల పొడవు ఉంటాయి. ఇదిలా ఉంటే మొసలిని భయపెట్టే జంతువు దాదాపు లేదనే చెప్పాలి. అసలు మొసలి రూపం చూస్తే దాని దరిదాపుల్లోకి కూడా ఏ జంతువు వెళ్ళదు. కానీ ఇక్కడ ఒక కుక్కపిల్ల మాత్రం మొసలికి చుక్కలు చూపించింది.
ఇప్పుడు మొసలి, కుక్క పిల్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత భారీ మొసలిని చూసినా ఆ కుక్క పిల్ల ఏమాత్రం తడబడకుండా పోట్లాడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో మొసలిని చూసిన కుక్కపిల్ల దానిపైకి వెళ్తుంది. అరుస్తూ మొసలిని భయపెడుతుంది. ఈ వీడియోలో మొసలి నీళ్లలోంచి బయటకు వచ్చి ఒడ్డున పడుకోవడాన్ని మీరు చూడవచ్చు. వెంటనే కుక్కపిల్ల కన్ను మొసలిపై పడింది. ఇది చూసిన వెంటనే కుక్కపిల్ల మొసలి ముందుకు పరుగెత్తింది, అది కూడా భయం లేకుండా దాని మీద అరుస్తుంది. కుక్క శబ్దం విన్న మొసలి నీటిలోకి పారిపోవడాన్ని కూడా మీరు చూడవచ్చు. అయితే రెండు సార్లు భయపడిన మొసలి మూడో సారి ఒడ్డుమీదకు వచ్చి ఆ కుక్కపిల్లను నోటితో పట్టేసుకుంది. ఆ తర్వాత దాన్ని తీసుకొని నీటిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ కింద వీడియో చూడండి.
Fking retard owners pic.twitter.com/kObPezUJnz
— Lo+Viral ? (@TheBest_Viral) October 25, 2022
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..