Viral Video: చిన్నారి చెప్పిన సమాధానానికి టీచర్ కు దిమ్మ తిరిగింది.. ఇంతకు ఆ బుడ్డది ఏమన్నదంటే..
ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఒక అందమైన చిన్నారి తన తల్లిపై తన టీచర్‌కి ఫిర్యాదు చేయడం..
సోషల్ మీడియా లో షేర్ అయ్యే వీడియోలు చూస్తుంటే కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతే కాదు కొన్ని వీడియోలు చూస్తే ఒక్కోసారి భయం, ఒక్కోసారి నవ్వు ఆపుకోలేకకళ్ళలో నీళ్లు తిరిగే వీడియోలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఒక అందమైన చిన్నారి తన తల్లిపై తన టీచర్‌కి ఫిర్యాదు చేయడం మీరు చూడవచ్చు. పిల్లల చేసే పనులు కొన్నిసార్లు కోపం తెప్పించిన కొన్ని సార్లు నవ్వుతెప్పిస్తాయి. ఈ వీడియో చూసిన వారు పదే పదే చూస్తున్నారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. చిన్నారి వీడియో చాలా క్యూట్ గా మాట్లాడింది.
ఈ వైరల్ వీడియోలో, కొంతమంది పిల్లలు ఒక తరగతిలో కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక చిన్నారి కూర్చుని ఏడుస్తూ కనిపించింది. అప్పుడు టీచర్ చిన్న పిల్లను ఏడుపు ఆపమని అంది. ఆ తర్వాత టీచర్ అడిగిన ప్రశ్నకు ఆ చిన్నారి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టీచర్ పాపను ‘ మీ అమ్మ ఏం చేస్తోంది అని అడిగింది. దానికి ఆ చిన్నారి అమాయకంగా ఏడుస్తూ.. కొడుతుంది అని అంది. ఎవర్ని అని ఆ టీచర్ ప్రశ్నించగా.. నన్నే అని సమాధానం ఇచ్చింది. అది విన్న టీచర్ షాక్ అయ్యింది. ఆ సమాధానం వింటే నిజంగా నవ్వు ఆపుకోలేము. అంటే తల్లి వెంటపడి కొడుతుందనేది ఆ చిన్నారి చెప్పడం ఆకట్టుకుంటోంది. పాప క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఇక్కడ చూడండి.
View this post on Instagram
ఈ వైరల్ వీడియో మీమ్లాజీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 618k వ్యూస్ , భారీగా లైక్‌లు, కామెంట్‌లు వస్తున్నాయి.