Watch Video: లక్షసార్లు ‘రామ’ నామం రాసింది.. అద్భుతాన్ని మలిచింది.. చూస్తే మైమరిచిపోతారంతే..
మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తోంది..
మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వారికి సోషల్‌మీడియా ఓ చక్కని వేదికగా మారింది. తాజాగా ఓ యువతి రామ రామా అంటూ రామకోటిని రాస్తుండగా అద్భుతం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్ శివానీ మందా చేత్తో రామ రామ అని రాస్తూ అద్భుతమైన పెయింటింగ్ గా మలిచింది.
ఇది నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పెయింట్, బ్రష్ లతో పని లేకుండా.. కేవలం స్కెచ్ పెన్నుల సాయంతో దేవనాగరి లిపిలో రామ్ అని ఒక లక్షా 11 సార్లు రాసి అద్భుతమైన పెయింటింగ్‌గా మార్చింది. రామ నామాలతో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అద్భుతంగా చిత్రీకరించింది. ఇందుకు ఆమె రంగు రంగుల స్కెచ్ పన్నులను ఉపయోగించింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.