Wife and Husband love: ఆలుమగల బంధానికి, ప్రేమకు నిదర్శనం ఈ జంట.. వైరల్ వీడియోకి నెటిజన్లు ఫిదా

దంపతులు రైలు కంపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు బెర్తులపై కూర్చొని ఉన్నారు. మహిళ తన భర్త బెర్తుపై కాలు పెట్టింది. అతను ఎంతో శ్రద్ధగా ఆమె కాలి వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ను వేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

Wife and Husband love: ఆలుమగల బంధానికి, ప్రేమకు నిదర్శనం ఈ జంట.. వైరల్ వీడియోకి నెటిజన్లు ఫిదా
Wife And Husband Love
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2022 | 3:56 PM

భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు భార్యపట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఇక్కడ రైల్లో ప్రయాణిస్తున్న భార్యభర్తలు కూడా ఆ కోవకు చెందినట్లుగానే అనిపిస్తోంది.  సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి తన భార్య కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ వేస్తున్నాడు. దంపతులు రైలు కంపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు బెర్తులపై కూర్చొని ఉన్నారు. మహిళ తన భర్త బెర్తుపై కాలు పెట్టింది. అతను ఎంతో శ్రద్ధగా ఆమె కాలి వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ను వేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దిలీప్ సోలంకి షేర్ చేశారు.

ఇంట్లో అందరూ వేస్తారు.. కానీ ఈ వ్యక్తి పబ్లిక్‌లో అలా తన భార్య కాలికి నెయిల్‌ పాలిష్‌ వేయడం విశేషం. ఆలూమగల మధ్య ప్రేమ, అనుబంధానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. దిలీప్‌ సోలంకి అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘సో క్యూట్‌..’, ‘‘భార్య అంటే ఎంత ప్రేమ.. ’’, ‘‘ఇలాంటి మధుర క్షణాల కోసం నేనూ ఎదురు చూస్తున్నా’’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dilip solanki (@dlipsolnki)

8 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. నెటిజన్లు లవ్ సింబల్ తో తమ ప్రేమని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..