Watch Video: వారెవ్వా ఏం ట్యాలెంట్ గురూ.. కీ హోల్ నుంచి బాణాలు సంధించి, ప్రపంచ రికార్డు సాధించి..
ఎవ్వరూ చేయని పని చేస్తేనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అలాంటి అసాధ్యాలను సాధించే వారికే గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కుతుంది. ఒకప్పుడు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కు సంబంధించిన వీడియోలు పెద్దగా ఎవరికీ తెలిసేవి కావు కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో అందబాటులోకి..
ఎవ్వరూ చేయని పని చేస్తేనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అలాంటి అసాధ్యాలను సాధించే వారికే గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కుతుంది. ఒకప్పుడు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కు సంబంధించిన వీడియోలు పెద్దగా ఎవరికీ తెలిసేవి కావు కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో అందబాటులోకి వచ్చిందో. అప్పుడు నుంచి ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ రికార్డ్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. అండర్సన్ అనే వ్యక్తి తన అద్భుత నైపుణ్యంతో గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 10 మి.మీ కంటే తక్కువ వ్యాసం ఉన్న కీహోల్ నుంచి బాణాలను సునాయాసంగా పంపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అండర్సన్ ఎంత దూరం నుంచి బాణాలను ప్రయోగించాడన్న విషయాన్ని గిన్నిస్ బుక్ వెల్లడించలేదు. కీహోల్ నుంచి సాధారణంగా ఈకలతో కూడిన బాణాలు దూసుకెళ్లవు.
ఈ కారణంతోనే అండర్సన్ రెక్కలు లేని కార్బన్ బాణాలను ఉపయోగించాడు. అండర్సన్ బాణాలను సంధించడానికి వందల ఏళ్ల కిందట ఒట్టోమన్ సైనికులు ఉపయోగించిన విల్లును ఎంచుకున్నాడు. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంత చిన్న హోల్ నుంచి బాణాలు దూసుకెళ్లడం అద్భుతంగా ఉంది. 10 మీ.మీ కంటే తక్కువ వ్యాసం ఉన్న హోల్ నుంచి ఎక్కువ బాణాలను పంపించిన వ్యక్తిగా అండర్సన్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..