Viral Video: రౌండప్ చేసి కన్య్ఫూజ్ చేయకండి.. కన్య్ఫూజన్లో ఎక్కువ తినేస్తా.. ఫన్నీ వీడియో వైరల్..
పులి వేట ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు..పులి వేట నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. ఎంత గుంపుగా ఉన్నా.
పులి వేట ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు..పులి వేట నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. ఎంత గుంపుగా ఉన్నా.. పులి ఏమాత్రం పట్టువిడవకుండా వేటాడి చంపేస్తాయి. పులి పంజాకు దొరికితే ఎంతటి భారీ జంతువైన సరే నెలకొరగాల్సిందే. అయితే కొన్నిస్రాలు పులులు కూడా వేటాడటంలో కన్య్ఫూజ్ అవుతుంటాయి. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు.. ఇటీవల సోషల్ మీడియాలో చిరుత పులులు.. పులులు.. సింహాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియో భయంకరంగా ఉండగా.. మరికొన్ని ఆశ్చర్యంగా.. ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు నవ్వేస్తారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందామా.
అందులో ఓ జింకల గుంపు మధ్యలోకి ఓ పులి వెళ్ళింది. అయితే చుట్టూ ఉన్న జింకలు పులిని చూసి పరిగెత్తాయి. అలా ఎక్కువ సంఖ్యలో జింకలు చుట్టూ పరిగెత్తడంతో పులి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎటువైపు జింకను వేటాడాలో తెలియక తికమక పడుతూ.. ఆ జింకల గుంపులోనే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. మొత్తానికి జింకను వేటాడి తినాలనుకున్న పులికి జింకల గుంపు మాత్రం షాకిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram
Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..