జిమ్‌లో జరిగిన ప్రమాదంతో నడవలేవని చెప్పిన వైద్యులు.. నేడు ప్రసిద్ధ బాడీ బిల్డర్‌.. 3 బంగారు పతకాలు, కిరిటంతో..

ఇక, తనకు సర్జరీ చేసిన వైద్యులు ఆమె ఎప్పటికీ నడవలేదని చెప్పారు. ఆ సమయంలో మార్కెల్ చేతి వేళ్లు కూడా సరిగా వంచలేకపోయింది. తన చేతులతో ఎలాంటి బరువైన వస్తువులను పట్టుకోవడం ఎత్తడం వంటివి చేయలేదని చెప్పారు. కూర్చోవడం, నడవడం లాంటివి ఇకపై తాను చేయలేదని తేల్చి చెప్పారు.

జిమ్‌లో జరిగిన ప్రమాదంతో నడవలేవని చెప్పిన వైద్యులు.. నేడు ప్రసిద్ధ బాడీ బిల్డర్‌.. 3 బంగారు పతకాలు, కిరిటంతో..
Lady Bodybuilder Marcelle Mendes
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2024 | 12:08 PM

బాడీ ఫిట్‌నెస్‌ కోసం వెళ్లి జిమ్‌లో వ్యాయామం చేయడం కొందరి పాలిట శాపంగా మారుతుంది. 2016లో ఓ రోజు 30 ఏళ్ల మార్కెల్ మెండిస్‌ అనే మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. రోజూలాగే జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె నడుముకి ఎక్స్‌రే తీయగా నడుము ఎముక విరిగిందని తేలింది. డాక్టర్ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, ఇప్పుడు ఆమె నడవలేని స్థితిలో ఉందని చెప్పారు. కానీ మార్క్లేఅది తప్పు అని నిరూపించింది. నేడు ఆమె బాడీ బిల్డర్‌గా ఎదిగి ఎన్నో బంగారు పతకాలు సాధించింది.

మార్క్లే వృత్తిరీత్యా న్యాయవాది. బ్రెజిల్‌లో నివసిస్తున్నారు. ఓ రోజు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా, అకస్మాత్తుగా ఆమె చేయి జారి నేలపై పడిపోయింది. ఆమె చాలా బలంగా పడిపోవడంతో ఆమె మెడ క్రింది భాగంలో బలంగా దెబ్బతగిలింది. ఆ ప్రాంతం మొద్దుబారింది. ఆమె ఆ భాగంలో ఏలాంటి అనుభూతి చెందలేదు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, నడుము ఎక్స్-రే తీసిన వైద్యులు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. ఇందులో ఆమెకు వెన్నుపూస (C4) పూర్తిగా విరిగిపోయింది. మరో రెండు వెన్నుపూస బొక్కలు C5, C6 వాటి స్థానంలో నుండి స్థానభ్రంశం చెందాయి. మార్కెల్‌ను వెంటనే శస్త్రచికిత్సకు తరలించారు. ఆమెకు వెన్నెముకలో టైటానియం ప్లేట్ అమర్చారు. వెన్నెముకను బలోపేతం చేయడానికి 6 స్క్రూలను బిగించారు.

Lady Bodybuilder Marcelle Mendes

ఇక, తనకు సర్జరీ చేసిన వైద్యులు ఆమె ఎప్పటికీ నడవలేదని చెప్పారు. ఆ సమయంలో మార్కెల్ చేతి వేళ్లు కూడా సరిగా వంచలేకపోయింది. తన చేతులతో ఎలాంటి బరువైన వస్తువులను పట్టుకోవడం ఎత్తడం వంటివి చేయలేదని చెప్పారు. కూర్చోవడం, నడవడం లాంటివి ఇకపై తాను చేయలేదని తేల్చి చెప్పారు.

కానీ, మార్క్లే పట్టుదలతో వైద్యులు ఓడిపోయారు. ఇంత జరిగినా మార్క్లే ఆశ కోల్పోలేదు. 6 నెలల పాటు ఫిజియోథెరపీ తీసుకుంది. ఇది ఆమెకు నడకలో చాలా సహాయపడింది. ఆమె జిమ్‌లో జరిగిన ప్రమాదం నుండి కోలుకోవడం ప్రారంభించింది. వేగంగా కోలుకుంది. తానే స్వయంగా వస్తువులను ఎత్తడం, పట్టుకోవడం మళ్లీ నేర్చుకుంది. ఫిజియోథెరపీ తర్వాత క్రమంగా శారీరక శ్రమను పెంచడం ప్రారంభించింది. తన శరీరంలో ప్రతి చిన్న మెరుగుదల తనకు ఒక అద్భుతంగా భావించింది. కొంత సమయం తర్వాత మళ్లీ జిమ్‌కి తిరిగి వచ్చినట్లు మార్క్లే చెప్పారు. తన కోచ్, సహచరుల సహాయంతో ఆమె తిరిగి కసరత్తు ప్రారంభించింది. అంతిమంగా ఆమె ఇక ఎప్పటికీ నడవలేదని చెప్పిన డాక్టర్ల మాటలు తప్పు అని నిరూపించింది. ఈ రోజు మార్క్లే మూడు బంగారు పతకాలు, ఒక కిరీటం గెలిచి విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మార్క్ల్‌కు మొదటి నుండి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. బాడీబిల్డర్ కావాలనుకుంది.. మళ్లీ జిమ్‌లో చెమటలు పట్టడం మొదలుపెట్టింది.. నేడు ఆమె ప్రసిద్ధ బాడీబిల్డర్. ఆమె వివిధ పోటీలలో 3 బంగారు పతకాలు, ఒక కిరీటం గెలుచుకుంది. అంతేకాదు పెద్ద పోటీకి కూడా సిద్ధమవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…