AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కదులుతున్న కారుపై కళ్లు చెదిరే స్టంట్.. తిక్క కుదిర్చిన పోలీసులు..

వైరల్ వీడియోలో ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి కారు నడుపుతూ డ్రైవింగ్ సీటులోంచి బయటకు వచ్చి కదులుతున్న కారు పైకప్పుపైకి ఎక్కాడు. ఈ సమయంలో కారు డ్రైవర్ లేకుండా వెళుతోంది. ఈ మారుతీ కారుపై రాజస్థాన్ నంబర్ ప్లేట్ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టిని ఆకర్షించింది.

Viral Video: కదులుతున్న కారుపై కళ్లు చెదిరే స్టంట్.. తిక్క కుదిర్చిన పోలీసులు..
Dangerous Killing Stunt
Jyothi Gadda
|

Updated on: May 31, 2024 | 9:49 AM

Share

ప్రస్తుతం ప్రజల్లో రీల్స్‌ పిచ్చి బాగా ముదిరింది. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొందరైతే వారి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రైల్వే ట్రాక్‌ల నుండి రోడ్ల వరకు స్టంటింగ్ చేస్తున్న అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి కారు నడుపుతూ డ్రైవింగ్ సీటులోంచి బయటకు వచ్చి కదులుతున్న కారు పైకప్పుపైకి ఎక్కాడు. ఈ సమయంలో కారు డ్రైవర్ లేకుండా వెళుతోంది. ఈ మారుతీ కారుపై రాజస్థాన్ నంబర్ ప్లేట్ ఉంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టిని ఆకర్షించింది. షాకింగ్ ఫుటేజ్‌లో రంగురంగుల టీ-షర్టు ధరించిన వ్యక్తి డ్రైవర్ లేకుండా కదులుతున్న తెల్లటి కారు పైకప్పుపై నిలబడి ఉన్నాడు. వీడియో వైరల్‌గా మారడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో ఈ వీడియోపై స్పందించారు. అవగాహన కోసం నవీ ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ప్రజలు కూడా ఈ వీడియోపై అనేక వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు- ఈ వ్యక్తి లైసెన్స్‌ని రద్దు చేయాలని డిమాండ్‌ చేయగా, మరొకరు ఇతనిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే, ఇది ప్రజలకు ప్రాణాంతకంగా మారుతుందన్నారు.

హై స్పీడ్, స్టంటింగ్ విషయంలో ఇలాంటివి చేయటం ఇది మొదటిది కాదు. గతంలో కూడా ఇలాంటి వ్యక్తుల చర్యలు ఇప్పటికే చాలా మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఇటీవల పూణెలో ఓ మైనర్ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై లగ్జరీ పోర్షే కారును నడిపి వారి మరణానికి కారణమయ్యాడు. ఈ విషయం ఇంకా జనాలు మర్చిపోనేలేదు. ఇప్పుడు కళ్యాణ్‌లో బీఎండబ్ల్యూ నడుపుతున్న మైనర్, దానిపై స్టంట్స్ చేస్తున్న యువకుడు చేసిన వికృత చేష్టలు వెలుగులోకి రావడంతో ఈ స్టంట్ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. స్టంట్‌ చేసి మైనర్‌ డ్రైవర్‌ తండ్రిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…