ఇదెక్కడి విచిత్రం.. హెయిర్‌కట్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. ఏకంగా జైల్లో పెట్టారు

ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. హెయిర్‌ కట్‌ ఆలస్యం చేశాడనే కారణంతో బార్బర్‌ని బంధించి జైల్లో పెట్టాడు ఓ పోలీసు ఉన్నతాధికారి. ఈ షాకింగ్‌ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు చేరటంతో చర్యలకు సిద్ధమయ్యారు. అసలు విషయం ఏంటంటే..

ఇదెక్కడి విచిత్రం.. హెయిర్‌కట్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. ఏకంగా జైల్లో పెట్టారు
Barber Kept In Lockup
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2024 | 8:43 AM

ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో సర్కిల్ ఆఫీసర్ (CO) సునీల్ కుమార్, బుధవారం హెయిర్‌కట్‌ కోసం స్థానిక క్షురకుడు వినోద్ కుమార్‌ను తన ఇంటికి పిలిపించాడు. అయితే, ఆ సమయంలో షాపులో కస్టమర్లు ఎక్కువగా ఉండటంతో కొంచెం ఆలస్యంగా ఆ పోలీస్‌ అధికారి ఇంటికి వెళ్లాడు బార్బర్‌ వినోద్‌ కుమార్‌. దీంతో సర్కిల్ ఆఫీసర్ (సీవో) సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హెయిర్‌కట్‌ చేసి వెళ్లిన ఆ బార్బర్‌ కోసం పోలీసులను పంపాడు. దీంతో పోలీసులు అతడి సెలూన్‌ షాప్‌కు వెళ్లి మరీ.. అతన్ని అరెస్ట్‌ చేశారు. ఆ షాపును బలవంతంగా మూయించారు. బార్బర్‌ వినోద్‌ కుమార్‌ను తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు బిసౌలీ పోలీస్‌ స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు.

మరోవైపు వినోద్‌ సోదరుడు శివకుమార్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. దీంతో జిల్లా ఎస్పీ అలోక్ ప్రియదర్శిని దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేసి ఆ పోలీస్‌ అధికారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..