ఓరియో బిస్కెట్లు, జీరా సోడాతో కలిపి ఆమ్లెట్.. డస్ట్ బిన్‌లో పడేయాలంటోన్న ఫుడ్ లవర్స్.. నెట్టింట్లో వైరల్ వీడియో
Viral Video: గతంలో ఓ వీధి వ్యాపారి ఓరియో బిస్కెట్లతో బజ్జీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బిస్కట్లు, కూల్ డ్రింక్స్ తో కలిపి ఆమ్లెట్‌ను తయారుచేశాడు కోల్‌కతాకు చెందిన ఓ వీధి వ్యాపారి.
Viral Video: రెగ్యులర్ వంటకాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వినూత్న వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో వెరైటీ విరెసిపీ ప్రయత్నిస్తున్నారు. తయారుచేయడమే కాదు వాటి మేకింగ్ వీడియోలు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో కొన్ని బాగుంటుంటే.. మరికొన్ని మాత్రం వికారం తెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి వెరైటీ వంటకం ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. గతంలో ఓ వీధి వ్యాపారి ఓరియో బిస్కెట్లతో బజ్జీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బిస్కట్లు, కూల్ డ్రింక్స్ తో కలిపి ఆమ్లెట్‌ను తయారుచేశాడు కోల్‌కతాకు చెందిన ఓ వీధి వ్యాపారి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో వీధి వ్యాపారి మొదట ప్యాన్‌పై కొంచెం నూనె బాగా మరిగిస్తాడు. ఆ తర్వాత ఓరియో బిస్కట్లను పొడిగా చేసి నూనెలో మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్ల మిశ్రమాన్ని కలుపుతాడు. ఆపై రెండు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని బ్రెడ్ ఆమ్లెట్‌ను తయారుచేస్తాడు. చివరిగా దానిపైకి తరిగిన ఉల్లిపాయలు, మిర్చీ, కొత్తిమీర, నిమ్మరసంతో పాటు మిగిలిపోయిన ఓరియో కుకీస్‌తో గార్నిషింగ్ టచ్ ఇచ్చి సర్వర్లకు అందిస్తున్నాడు. ఈ వెరైటీ రెసిపీ చూసిన నెటిజన్లను తెగ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ఆహార ప్రేమికులు విస్తుపోతున్నారు. ఇదేం ఐడియారా బాబు, ఇది చాలా దారుణం, ఇలాంటి డిషెస్‌ను డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..