Viral Video: షూ వేసుకునేందుకు యత్నించిన మహిళకు షాకింగ్ అనుభవం.. ఆ దృశ్యం చూసి పరుగే పరుగు
బయటకు వెళ్లేందుకు షూ వేసుకునేందుకు సిద్దమైన మహిళకు ఊహించని అనుభనం ఎదురైంది. ఒక్కసారిగా ఆమె అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతకీ ఏమైందంటే..?
Trending Video: ఓ మహిళ బయటకు వెళ్లేందుకు టిప్ టాప్‌గా రెడీ అయింది. హడావిడిగా షూ స్టాండ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో బూట్లు వేసుకోబోతుండగా ఆమెకు ఊహించని షాక్ తగిలింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది పరిస్థితి. ఓ షూ లోపల నుంచి నాగపాము(Cobra) బుసలు కొట్టింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రజంట్ రెయినీ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వర్షాలు, వరదలకు పాములు పుట్టల్లో నుంచి, మరుగు ప్రాంతాల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి వస్తాయి. ఈ మధ్య సిటీల్లో కూడా పాములు కనిపించడానికి కారణం అదే. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ఇంట్లో వెలుగుచూసింది. తన చెప్పుల స్టాండులో నుంచి బూట్లు వేసుకునేందుకు వచ్చిన మహిళ ఓ షూ లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు అక్కడకు చేరుకుని ఆ పామును రెస్క్యూ చేశారు. IFS అధికారి సుశాంత నంద ఈ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ట్రైనింగ్ తీసుకున్న స్టాఫ్ సహాయం తీసుకోండి అంటూ సూచించారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel. WA fwd. pic.twitter.com/AnV9tCZoKS
— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..