Viral Video: చదువమన్న తండ్రికి కూతురు చెప్పిన షాకింగ్ ఆన్సర్.. వైరల్ అవుతున్న వీడియో
వైరల్ అవుతున్న వీడియోలో తండ్రి తన కూతురితో చదువు గురించి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి చాలా అమాయకంగా సమాధానాలు చెబుతోంది.

సోషల్ మీడియాలో రోజు అనేక రకాల ఫన్నీ వీడియోలు చూస్తూనే ఉంటాం. పెంపుడు కుక్కలు, పిల్లులు, ఏనుగులు చేసే విన్యాసాలు.. పిల్లల చేసే ఫన్నీ పనులు ఎక్కువగా నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటాయి తాజాగా ఓ చిన్నారి కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత.. ఎవరికైనా తమ బాల్యం గుర్తుకు వస్తుంది.
చాలా సార్లు పిల్లలు తమ అమాయకత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. ఎందుకంటే ఆ చిన్నారుల్లో కల్లాకపటం ఉండదు. మనసులో ఏది ఉంటే.. అదే అనేస్తారు. చాలా సార్లు చిన్నారులు తమ అమాయకత్వంలో అవతల వ్యక్తులను నేరుగా కనెక్ట్ అవుతారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో తండ్రి తన కూతురితో చదువు గురించి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి చాలా అమాయకంగా సమాధానాలు చెబుతోంది.




వైరల్ అవుతున్న వీడియోలో, ఒక తండ్రి తన కుమార్తెతో ఆమె చదువు గురించి మాట్లాడుతూ..చదవడం, రాయడం వలన నాకు ప్రయోజనమా.. నీకా అని ఏడుస్తున్న కుమార్తెను ప్రశ్నిస్తున్నాడు.. వెంటనే ఆ చిన్నారి నీకే ప్రయోజనం అంటుంది. ఎలా అంటున్న తండ్రికి నేను చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించగానే.. తల్లిదండ్రులు డబ్బులు అన్నీ తీసుకుంటారని.. కనుక నేను చదువుకోవడం వలన నీకే ప్రయోజనం అంటూ అమాయకంగా తండ్రిని చెబుతోంది చిన్నారి. అంతేకాదు.. నేను చదువుకుని పెద్దయ్యాక డాక్టర్‌ని కాలేనని, అంతకుముందే దెబ్బలు తింటూ చనిపోతానని కన్నీళ్లు పెట్టుకుంది.
View this post on Instagram
యూనిక్‌మాత్‌సర్ అనే ఖాతాలో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరు, ‘అమ్మాయి నిజంగా చాలా అమాయకురాలు’ అని రాశారు. అదే సమయంలో, ‘అమ్మాయి ఏది చెప్పిందో అది పూర్తిగా నిజం’ అని.. మరొకరు కామెంట్ చేయగా.. ఈ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిపై మరోకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
