AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ నిర్ణయం.. స్కూల్ సిలబస్ నుంచి పీరియడ్స్, సుఖ వ్యాధులు, లైంగిక అంశాలు బ్యాన్

అమెరికాలోని ఫ్లోరిడాలో అధికారులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలో చదివే పిల్లలకు పీరియడ్స్, లైంగిక సంబంధాలు, సుఖ వ్యాధులకు సంబంధించిన అంశాలు బోధించకుండా నిషేధం విధించనున్నారు.

షాకింగ్ నిర్ణయం.. స్కూల్ సిలబస్ నుంచి పీరియడ్స్, సుఖ వ్యాధులు, లైంగిక అంశాలు బ్యాన్
Girl
Aravind B
|

Updated on: Mar 20, 2023 | 1:29 PM

Share

అమెరికాలోని ఫ్లోరిడాలో అధికారులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలో చదివే పిల్లలకు పీరియడ్స్, లైంగిక సంబంధాలు, సుఖ వ్యాధులకు సంబంధించిన అంశాలు బోధించకుండా నిషేధం విధించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ లో ఈ చట్టాన్ని ప్రవేశిపెట్టారు. తొందర్లోనే అత్యధిక ఓట్లతో ఈ బిల్లు పాస్ అవుతుందని అధికారులు తెలిపారు. ఒకవేల బిల్లు పాసైతే ఆరు నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ 4వ తరగతి లేదా 5 వ తరగతి పిల్లలకు కూడా పీరియడ్స్ వస్తే వారికి కూడా ఈ నిబంధనను అమలు చేస్తారా అని ఫ్లోరిడా ప్రతిని అష్లే గాట్ అడిగారు. దానికి స్పందించిన రిపబ్లికన్ ప్రతినిధి మెక్ క్లేయిన్ అలా కూడా చేస్తామని బదులిచ్చారు.

ఫ్లోరిడాలోని పాఠశాలల్లో లైగింక విద్యపై ఏకరూపతను తెచ్చేందుకే ఈ బిల్లును తీసుకొచ్చామని క్లేయిన్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరం లేని మెటీరియల్స్, పుస్తకాలను చదవనీయకుండా అభ్యంతరం తెలిపేందుకు ఈ బిల్లు మరింత సౌలభ్యం కల్పిస్తుందని తెలిపారు. ఒకవేళ విద్యార్థులతో ఈ అంశాలపై స్కూల్ టీచర్లు చర్చిస్తే వారిపై చర్యలు తీసుకుంటారా ఇని అష్లే గాట్ కమిటీ మీటింగ్ లో అడిగారు. తక్కువ వయసున్న అమ్మాయిలతో ఈ అంశాలపై మాట్లడితే వాళ్లు కూడా సురక్షితంగా ఉన్నట్లు భావించలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన క్లేయిన్ బిల్లు ఉద్దేశం అది కాదని.. వారు మాట్లాడే భాషలో కొన్ని మార్పులు చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం