Afghan Crisis: తాలిబాన్లకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మహిళలు .. ఆడపిల్లలకు స్కూల్స్ తెరవాలంటూ డిమాండ్

రోజు రోజుకీ తమ దేశంలో పరిస్థితులు దారుణంగా తయారు కావడంతో.. ఇప్పుడు తాలిబాన్లకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు పెరగడం ప్రారంభించాయి. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఆఫ్ఘనీయ కుటుంబాలు మరోసారి తాలిబన్లను కోరాయి.

Afghan Crisis: తాలిబాన్లకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మహిళలు .. ఆడపిల్లలకు స్కూల్స్ తెరవాలంటూ డిమాండ్
Afghan Women Protest
Follow us

|

Updated on: Mar 20, 2023 | 12:57 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు పాలన చేపట్టినప్పటి నుంచి మహిళలు, బాలికల జీవన విధానంపై తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో అక్కడ మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆడపిల్లలను చదువుకోకుండా ఆపారు.. మహిళలు ఉద్యోగాలు చేయకుండా నిషేధించారు. రోజు రోజుకీ తమ దేశంలో పరిస్థితులు దారుణంగా తయారు కావడంతో.. ఇప్పుడు తాలిబాన్లకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు పెరగడం ప్రారంభించాయి. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఆఫ్ఘనీయ కుటుంబాలు మరోసారి తాలిబన్లను కోరాయి. ఇప్పటికే ఇటువంటి డిమాండ్ తాలిబన్ల ముందు వచ్చిన సంగతి తెలిసిందే.

TOLO న్యూస్ నివేదిక ప్రకారం.. తాలిబాన్ ప్రభుత్వ పాలనలో తమ కుమార్తెల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆఫ్ఘన్ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో పాఠశాలలను తెరవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పటి ప్రభుత్వం బాలికల విద్యను అభ్యసించకుండా అడ్డుకుంటున్నారు. దీంతో తమ ఆడపిల్లల భవిష్యత్తు నాశనమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాఠశాలలను పునఃప్రారంభించేందుకు తాలిబన్లు ఇంకా ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.

ప్రమాదంలో ఆడపిల్లల భవిష్యత్తు  వాస్తవానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేపట్టినప్పటి నుండి.. ఆరవ తరగతి నుంచి ప్రారంభమయ్యే ఉన్నత పాఠశాలలు మూసివేశారు. గతేడాది డిసెంబర్‌లో బాలికలు, మహిళలు యూనివర్శిటీలో చేరకూరదని నిషేధించారు. ఎన్జీవోలతో కలిసి పనిచేయడాని చెప్పారు.

ఇవి కూడా చదవండి

దేశంలో కొనసాగుతున్న పరిస్థితులపై ఆఫ్ఘన్ కుటుంబాలు విచారం వ్యక్తం చేశాయి. తాలిబన్ అధికారుల క్రూరమైన నిర్ణయాల వల్ల తన కూతుళ్ల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్టేషనరీ వ్యాపారంపైనా ప్రభావం  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడం వల్ల ఆడపిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడటమే కాదు. దీంతో స్టేషనరీ వ్యాపారం కూడా నష్టాల్లో కూరుకుపోయింది. బాలికల పాఠశాలలను మూసివేయడం వల్ల తమ వ్యాపారం కూడా దెబ్బతిందని స్టేషనరీ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తన వ్యాపారం 80 శాతం తగ్గిపోయిందని స్టేషనరీ దుకాణం నిర్వహిస్తున్న రఫీవుల్లా తెలిపారు. ఇంతకుముందు వ్యాపారం బాగానే ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..