Walk Barefoot: ఒక చిన్న ఘటన అతని జీవితాన్ని మార్చివేసింది.. గత 20 ఏళ్లుగా చెప్పులు ధరించని వ్యక్తి..
USAలోని కనెక్టికట్‌లో నివసిస్తున్న 59 ఏళ్ల జోసెఫ్ డెరువో జూనియర్ దాదాపు 20 ఏళ్ల క్రితం చివరిసారిగా బూట్లు ధరించాడు. నివేదిక ప్రకారం, 2002 సంవత్సరంలో.. జోసెఫ్ కాలి బొటనవేలు వాచింది.
కాళ్లకు రక్షణ ఇచ్చే చెప్పులను ఇంట్లో ఉన్న సమయంలో లేదా పూజాది శుభకార్యాల సమయంలో ధరించం.. బయటకు వెళ్తున్నప్పుడు చెప్పులను, లేదా బూట్లను ధరించి అప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడతాం.. ఇలా చేయడం వలన మన పాదాలకు రక్షణ ఉంటుంది. అయితే మన చుట్టూ ఎవరైనా వ్యక్తులు.. చెప్పులు లేదా బూట్లు లేకుండా తిరుగుతుంటే.. వారిని అదో ఏడో వింత అన్నట్లు చూస్తాం.. అయితే ఒక వ్యక్తి గత కొన్ని ఏళ్లుగా చెప్పులు కానీ, బూట్లు గానీ ధరించకుండా తిరుగుతున్నాడని మీకు తెలుసా..
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ వ్యక్తి గత ఇరవై ఏళ్లుగా చెప్పులు, బూట్లు లేకుండా తిరుగుతున్నాడు. ప్రపంచంలో ఇలా తిరుగుతున్న ఒకే ఒక్కడుగా చరిత్ర సృష్టించాడు. USAలోని కనెక్టికట్‌లో నివసిస్తున్న 59 ఏళ్ల జోసెఫ్ డెరువో జూనియర్ దాదాపు 20 ఏళ్ల క్రితం చివరిసారిగా బూట్లు ధరించాడు. నివేదిక ప్రకారం, 2002 సంవత్సరంలో.. జోసెఫ్ కాలి బొటనవేలు వాచింది. ఇలా వేలు వాపు వచ్చి విపరీతమైన నొప్పి రావడానికి కారణం.. అతను ఎప్పటి నుంచో ధరిస్తున్న స్పోర్ట్స్ షూ అని తెలుసుకున్నాడు. వాపును చూసిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. అప్పటి నుంచి అతను బూట్లు ధరించడం మానేశాడు. ఎందుకంటే అతను బూట్లు వేసుకున్నప్పుడల్లా భరించలేని నొప్పి వచ్చేది. దీంతో తాను ఇక నుంచి బూట్లు ధరించకూడదని నిర్ణయించుకున్నాడు.
అందుకే 20 ఏళ్లుగా చెప్పులు, బూట్లు వేసుకోలేదు ఈ నిర్ణయం డాక్టర్ సలహా మేరకే తీసుకున్నాడు. జోసెఫ్ తీసుకున్న నిర్ణయంతో శస్త్రచికిత్స చేయాల్సిన రోజు వచ్చే సమయానికి..కాలి నొప్పి, వాపు గణనీయంగా తగ్గింది. దీంతో వైద్యులు సర్జరీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పటి నుంచి అతని కాలి వేలు నొప్పి తగ్గడం ప్రారంభించింది. అందుకే అప్పటి నుండి ఈ రోజు వరకూ జోసెఫ్ చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. తాను చివరిసారిగా బూట్లు, చెప్పులు వేసుకున్నది ఎప్పుడో కూడా తనకు గుర్తు లేదని, అయితే 2002లో తాను బూట్లు ధరించడం మానేశానని గుర్తు చేసుకున్నాడు.
అయితే ఇలా చెప్పులు, బూట్లు ధరించే అలవాటు వల్ల జోసెఫ్ అనేక సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా సార్లు పాదరక్షలను ధరించలేదంటూ కొన్ని రెస్టారెంట్‌లోకి ప్రవేశించడానికి కూడా అనుమతి కూడా ఇవ్వలేదు. అటువంటి సమయంలో కాళ్లకు ధరించడానికి పల్చటి చెప్పులు ధరిస్తాడు. ఆ చెప్పులను అందుబాటులో ఉండేలా కారులో ఉంచుకుంటాడు. వాటిని ధరించి అప్పుడు లోపలి వెళ్తాడు. అనంతరం వెంటనే ఆ చెప్పులను విడిచి మళ్ళీ మాములుగా నడుస్తాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..