AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కట్నం కోసం భర్త రెండో పెళ్లి.. చెప్పుతో చితకొట్టిన భార్య.. సినిమా సీన్ ను మించి..

ఇటీవలి కాలంలో వరకట్నం కేసుల ఉదంతాలు బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే ప్రస్తుతం పెళ్లికి వధువు దొరకడం లేదని చాలా మంది అబ్బాయిలు బోరుమంటున్నారు. పైగా కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ అతను రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా, కట్నం కోసం దురాశతో అతను మరొక వివాహానికి సిద్ధపడ్డాడని తెలిసింది. ఇంట్లో భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు.. కానీ, అతని పథకం ఫలించలేదు.. ఎలాగోలా విషయం అతని భార్యకు తెలిసింది..దాంతో సదరు రెండో పెళ్లికొడుక్కి తగిన విధంగా శిక్షించింది. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch: కట్నం కోసం భర్త రెండో పెళ్లి.. చెప్పుతో చితకొట్టిన భార్య.. సినిమా సీన్ ను మించి..
Wedding
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2025 | 2:06 PM

Share

ఇటీవలి కాలంలో వరకట్నం కేసుల ఉదంతాలు బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే ప్రస్తుతం పెళ్లికి వధువు దొరకడం లేదని చాలా మంది అబ్బాయిలు బోరుమంటున్నారు. పైగా కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ అతను రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా, కట్నం కోసం దురాశతో అతను మరొక వివాహానికి సిద్ధపడ్డాడని తెలిసింది. ఇంట్లో భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నాడు.. కానీ, అతని పథకం ఫలించలేదు.. ఎలాగోలా విషయం అతని భార్యకు తెలిసింది..దాంతో సదరు రెండో పెళ్లికొడుక్కి తగిన విధంగా శిక్షించింది. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వార్త ఏదో సినిమాలోని వార్తలా అనిపిస్తుంది. కానీ ఇది సినిమా కథ కాదు, సినిమా కథను మించిన విచిత్ర భర్త కథ. కర్ణాటకలోని చిత్రదుర్గలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న భర్తను మొదటి భార్య మండపంలోనే చెప్పుతో కొట్టింది. చిక్కమగళూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం తనూజను వివాహం చేసుకున్నాడు. అయితే కట్నం కోసం అతడు వేరే పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న తనూజ తన కుటుంబంతో కలిసి పెళ్లి మండపానికి వచ్చి కార్తీక్‌ను నిలదీసింది. అయినా వినకపోవడంతో చెప్పుతో కొట్టి పెళ్లిని ఆపింది.

వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి

కట్నం కోసం దురాశతో రెండో పెళ్లికి సిద్ధమైనందుకు పెళ్లి మండపంలోనే అతని ముఖంపై చెప్పుతో కొట్టి తగిన గుణపాఠం చెప్పింది. ఈ సంఘటన చిత్రదుర్గ నగరంలోని గాయత్రి కళ్యాణ మండపంలో చోటు చేసుకుంది. పెళ్లికి సిద్ధపడ్డ రెండో వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఇది చాలా పాత వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ, విషయం మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..