Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తెల్లవారుజామున కిటికీ వద్ద కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా.. బాబోయ్

చల్లటి వాతావరణం.. పైగా తెల్లవారుజామున చిమ్మచీకటి.. ఎటు చూసినా ఏం కనిపించట్లేదు. అంతా చీకటే.. ఈలోగా మీ ఇంటి కిటికీ దగ్గర వింత ఆకారం కనిపిస్తే.. ఏమవుతుంది అంటారు. ఈ తరహ ఘటన ఒకటి మీతో పంచుకుంటున్నాం. ఆ వివరాలు ఇలా..

Viral Video: తెల్లవారుజామున కిటికీ వద్ద కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా.. బాబోయ్
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2025 | 1:33 PM

మనలో కొందరు తెల్లారేసరికల్లా నిద్రలేస్తారు. ఉదయాన్నే తమ పనులు ముగించుకుంటూ ఉంటారు. ఇక మన అమ్మలు అయితే.. పిల్లల కోసం స్కూల్స్‌కి క్యారేజీలు.. ఇంట్లోని వాళ్లకు టిఫిన్లు ఇలా.. అన్ని కూడా తెల్లవారుజామునే లేచి చేసేస్తారు. మరి అలా తెల్లారి లేచిన తర్వాత.. నిశ్శబ్దమైన వాతావరణంలో ఏదైనా వింత ఆకారం కనిపిస్తే.. ఏమవుతుంది.! దెబ్బకు గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది. ఆ తరహ ఘటనే ఇది.

లీన్ అనే ఓ వ్యక్తి ఉదయాన్నే 5 గంటలకు చెత్త పారవేయడానికి ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఆ వీధి అంతా నిశ్శబ్ధంగా ఉంది. చల్లటి గాలి, ఓ వైపు ఏదో తెలియని భయం. అయితేనేం అలానే నెమ్మదిగా తిరిగి ఇంటి గేటు తీస్తుండగా.. కిటికీ దగ్గర కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. అతడి ఇంటి కిటికీ దగ్గర ఓ భయంకరమైన ఆకారం కనిపించింది. దానికి పొడవైన చేతులు.. అలాగే ఫేస్ కనిపించకుండా.. ఏదో రకమైన ఆత్మలా అనిపించింది. దాని ఉనికి అసహజంగా ఉంది. ఆపై మరింత భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది.

ఇవి కూడా చదవండి

ఆ నల్లటి ఆకారం నెమ్మదిగా కిటికీ తలుపు మూసింది. అస్సలు శబ్దమే రాలేదు. దెబ్బకు లీన్ గుండె దడదడలాడిపోయాడు. వెంటనే ఇంట్లోకి పరుగుపెట్టి.. అంతా వెతకగా.. అక్కడ ఏం కనబడలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అది ఒక దెయ్యం, లేదా జిన్ లేదా అంతకంటే భయంకరమైనది కావచ్చునని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..