Viral: సమాధులను తవ్వుతున్న గ్రామస్తులు.. ఆ ఊరిలో వర్షాకాలం వస్తే ఇంతే.. కారణం తెలిస్తే షాకే!

వర్షాకాలం వస్తే చాలు.. ఆ ఊరిలోని జనాలు స్మశానవాటిక దగ్గరకు వెళ్లి.. ఒక్కో సమాధిని తవ్వుతారు.

Viral: సమాధులను తవ్వుతున్న గ్రామస్తులు.. ఆ ఊరిలో వర్షాకాలం వస్తే ఇంతే.. కారణం తెలిస్తే షాకే!
Graves Representative ImageImage Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2022 | 1:56 PM

వర్షాకాలం వస్తే చాలు.. ఆ ఊరిలోని జనాలు అంతా ఒకటవుతారు. స్మశానవాటిక దగ్గరకు వెళ్లి.. ఒక్కో సమాధిని తవ్వుతారు. అక్కడితో ఆగరు. శవాలకు నీళ్లు తాగిస్తారు. ఏంటి.! వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండీ ఇది నిజం. కర్ణాటక బీజాపూర్‌లోని కలకేరి గ్రామస్తులు.. ప్రతీ ఏడాది వర్షాకాలంలో సమాధులు తవ్వి.. శవాలకు నీళ్లు పట్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు. ఆ కథేంటంటే.!

గత కొద్దిరోజులుగా దేశమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకలోని కలకేరి గ్రామంలో మాత్రం ఒక్క చుక్క చినుకు కూడా కురవలేదు. దీనికి తమ గ్రామానికి ఉన్న శాపమే కారణమని నమ్మిన ఆ గ్రామస్తులు గత నెల రోజుల్లో చనిపోయిన వారి లిస్టును సిద్దం చేశారు. వారి కుటుంబీకులతో చర్చించి.. చనిపోయిన మీ ఆప్తుల దప్పిక తీర్చేందుకు సహకరించాలని కోరారు.

అనంతరం వారి సమాధుల దగ్గరకు వెళ్లి.. తల దిక్కున ఉందో తెలుసుకుని.. రెండు అడుగుల గుంత తవ్వి.. పైప్ ద్వారా మృతదేహానికి నీటిని పట్టించారు. ఇలా 25 సమాధుల్లోని మృతదేహాలకు నీరు తాగించారు. అంతే! చిత్రంగా కొద్దిసేపటికే ఆ ఊర్లో చినుకులు పడటం మొదలయ్యాయట.

ఇవి కూడా చదవండి

అసలు ఇంతకీ ఏంటా శాపం:

కొద్దిరోజుల కిందట ఆ ఊర్లో ఓ పెద్దాయన నోరు పెద్దగా తెరిచి చనిపోయాడు. అతడి నోరు మూయకుండానే గ్రామస్తులు ఖననం చేశారు. ఇలా చేయడం వల్ల తర్వాతి ఏడాది ఆ ఊర్లో తీవ్ర కరువు, దుర్భిక్షం వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. తమ ఊరికి ఇంత సడన్‌గా ఏమైందని.. ఓ జోతిష్యుడిని పిలవగా.. అతడు ‘దాహం’తో ఉన్న శవం గ్రామానికి శాపాన్ని తెచ్చిపెట్టిందని అన్నాడు. ఇక జోతిష్యుడి సూచన మేరకు ఆ వృద్దుడి సమాధాని తవ్వి.. పైప్ ద్వారా మృతదేహానికి నీరు పట్టించారు గ్రామస్తులు. అనంతరం కొద్దిసేపటికే అక్కడ వర్షం కురిసిందట. ఏది ఏమైనా ఇలాంటి ఆచారం వినడానికి కొత్తగా ఉంది కదూ..!(Source)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి