Viral Video: ఇదెక్కడి పైత్యం తల్లి.. రిపోర్టింగ్‌ అంటూ వరద నీటిలో ఫోటో షూట్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

ఈ చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక రిపోర్టింగేనా అన్నారు. ఆమె NDRF వాలంటీర్‌ని కేవలం రిపోర్టింగ్ కోసం తన ఫోటోల ఫోజుల కోసమే అన్నట్టుగా ఉందని విమర్శించారు.

Viral Video: ఇదెక్కడి పైత్యం తల్లి.. రిపోర్టింగ్‌ అంటూ వరద నీటిలో ఫోటో షూట్‌.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు
Delhi Floods
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2023 | 2:51 PM

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీలో వరదల నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ మెడలోతు నీటిలో రిపోర్టు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. వరదలపై రిపోర్టింగ్ కోసం ఆమె NDRF స్క్వాడ్‌కు అందించిన పరికరాలను ఉపయోగించి మరీ న్యూస్‌ అందిస్తున్న దృశ్యం కనిపిచంఇంది. ఇంకేముంది సోషల్ మీడియాలో వీడియో వేగంగా వైరల్ అయ్యింది. రత్తన్ ధిల్లాన్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక లేడీ జర్నలిస్ట్ వరద నీటిలో మునిగిపోకుండా సేఫ్టీ ట్యూబ్‌ను ధరించి రిపోర్టింగ్ చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే,ఆ లేడీ రిపోర్టర్‌కు దగ్గరగానే NDRF సిబ్బంది రెస్క్యూ బోట్‌లో కనిపిస్తారు. వారిలో ఒకరు సంఘటన వీడియోను రికార్డ్‌ చేశారు. మరొక NDRF సిబ్బంది జర్నలిస్ట్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరాకు పోజులిస్తుండగా వారు ఫోటోలు తీయడం కూడా కనిపించింది. ధిల్లాన్ ఈ చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక రిపోర్టింగేనా అన్నారు. ఆమె NDRF వాలంటీర్‌ని కేవలం రిపోర్టింగ్ కోసం తన ఫోటోల ఫోజుల కోసమే అన్నట్టుగా ఉందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వ్యక్తిగత ఉపయోగం కోసం NDRF పరికరాలను ఉపయోగించినందుకు రిపోర్టర్‌ను నిందించడానికి నెటిజన్లు కామెంట్ బాక్స్‌ని నింపేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..