Viral News: భూమిపై ఎక్కువ కాలం నుంచి జీవిస్తోన్న ప్రాణి ఇదే.. దీని వయసు 190 ఏళ్లు..
Viral News: మనకు తెలిసినంత వరకు ఏ ప్రాణి అయినా వందేళ్లకు మించి జీవించదు. అది మనిషైనా, జంతువైనా. అయితే ఓ జీవి మాత్రం వందేళ్లు దాటేసి 200 ఏళ్లు దిశగా ప్రయణిస్తోంది. ఇటీవలే 190వ బర్త్‌డేను జరపుకుంది. ఇంతకీ ఆ జీవి ఎంటి.? ఎక్కడ ఉంది.?

Viral News: మనకు తెలిసినంత వరకు ఏ ప్రాణి అయినా వందేళ్లకు మించి జీవించదు. అది మనిషైనా, జంతువైనా. అయితే ఓ జీవి మాత్రం వందేళ్లు దాటేసి 200 ఏళ్లు దిశగా ప్రయణిస్తోంది. ఇటీవలే 190వ బర్త్‌డేను జరపుకుంది. ఇంతకీ ఆ జీవి ఎంటి.? ఎక్కడ ఉంది.? లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం. జోనాథన్ అనే ఓ తాబేలు 1832లో జన్మించింది. తాజాగా ఈ తాబేలు 190 ఏళ్లు పూర్తి చేసుకొని భూమి మీద నివసిస్తున్న అత్యంత ఎక్కువ వయసున్న జీవిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఈ తాబేలు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
ఈ తాబేలు అల్డబ్రా జెయింట్ జాతికి చెందినది. దక్షిణ అంట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీ అయిన సెయింట్ హెలెనా ద్వీపంలో ఉందీ తాబేలు. 1832లో జన్మించిన ఈ తాబేలను 1882లో ఈ ద్వీపానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ ఐలాండ్‌కు గవర్నర్‌గా ఉన్న గ్రే విల్సన్ ఈ తాబేలును బహుమతిగా పొందారు. తాజాగా ఈ తాబేలుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే గతంలో అత్యధిక కాలం జీవించిన తాబేలుగా టుయ్ మలీలా, 189 ఏళ్లుగా గిన్నిస్ బుక్ రికార్డు ఉండేది. అయితే భారత్‌లోని కోలకతాలో ఉన్న జులాజికల్ గార్డెన్స్‌లో అద్వైత అనే తాబేలు 255 ఏళ్లు జీవించి ఉందని నమ్ముతారు, అయితే దీనిని ఎవరూ ధృవీకరించలేదు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం జీవించి ఉన్న జోనాథన్ అత్యంత వయసున్న తాబేలన్నమాట.

Mahabubabad: మహబూబాబాద్‌లో దారుణం.. పట్ట పగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డళ్లతో..
