Love Affair: ప్రియుడి జననాంగం కోసేసిన ప్రేయసి.. నేరుగా ఎక్కడికి వెళ్లిందంటే..
Jharkhand News: జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ తన ప్రియుడి జననాంగాలను కోసేసింది. ఆ ఘటనతో ప్రియుడు అపస్మారక స్థితికి చేరగా.. అతను చనిపోయాడని భావించింది. దాంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులకు జరిగిన విషయం చెప్పింది. ఆమె చెప్పింది విన్న పోలీసులు.. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకోగా.. అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని గుర్తించిన పోలీసులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. మరి ఇంతకీ ఆ మహిళ ఎందుకలా చేసింది? వారి మధ్య ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లా తారాతండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామానికి చెందిన ఓ మహిళకు పెళ్లై భర్తకు దూరంగా, ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన సుశీల్ తుడుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆమెతో శారీరకంగా కలిసేవాడు సుశీల్. ఇతగాడికి కూడా వివాహ జరిగింది. అయితే, తాజాగా సదరు మహిళ తనను పెళ్లి చేసుకోవాలని సుశీల్‌ను కోరింది. అతన్ని బలవంతం చేసింది. దాంతో ఆగ్రహించిన సుశీల్.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఇలా లాభం లేదనుకున్న మహిళ.. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఆమె కూడా అతనిలాగే కుట్ర చేసింది. ప్రైవేట్‌గా కలవాలంటూ.. అతన్ని పిలిచింది. అతను రానే వచ్చాడు. ఆమెతో సరసాలు మొదలు పెట్టాడు. కానీ, అప్పటికే పక్కా ప్లాన్‌తో సిద్ధంగా ఉన్న మహిళ.. అతనిపై అటాక్ చేసింది. చేతిలో బ్లేడ్ తీసుకుని.. అతని ప్రైవేట్ భాగాలను కట్ చేసింది. దాంతో అతను అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను చనిపోయాడని భావించిన మహిళ.. నేరుగా తారాతాండ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపింది.
మహిళ చెప్పిన మ్యాటర్ విని అవాక్కైన పోలీసులు.. ముందుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తీసుకుని నేరుగా ఘటనా స్థలికి వెళ్లారు. అయితే, సుశీల్ చనిపోలేదని, అపస్మారక స్థితిలోకి వెళ్లాడని గుర్తించిన పోలీసులు.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సుశీల్ ప్రైవట్ పార్ట్స్ కోసేసిన మహిళ.. తనను సుశీల్ మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఇటు ఆమె ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయడంతో పాటు.. దారుణానికి పాల్పడిన ఈమెపైనా కేసు నమోదు చేశారు.
అయితే, సుశీల్, మహిళ ఇద్దరికీ ఇంతకు ముందే వివాహం జరిగింది. భర్తను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్న మహిళతో సుశీల్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తన భార్యకు తెలియకుండా ఆమెతో అక్రమ సంబంధం నడిపాడు. వీరిద్దరికి కూడా పిల్లలు ఉన్నారు. మొత్తానికి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..