AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ..! 7000 మంది ప్రయాణికులు, 40 రెస్టారెంట్లతో.. టికెట్‌ ధర ఎంతో తెలుసా..?

ప్రపంచంలోనే అతిపెద్ద నౌక, ఐకాన్ ఆఫ్ ది సీస్. ఇది రాయల్ కరీబియన్ గ్రూపునకు చెందిన భారీ నౌక. ఈ నౌకలో ఒకేసారి 7 వేల 100 మంది ప్రయాణించవచ్చు. ఓడలో 7 స్విమ్మింగ్ పూల్స్, 6 వాటర్ స్లైడ్‌లు ఉన్నాయి. 40 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక బార్, లాంజ్ కూడా ఉంది. ఐకాన్ ఆఫ్ సీస్ నిర్మాణానికి 149 బిలియన్ రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. మీరు ఈ క్రూయిజ్‌లో ప్రయాణించాలనుకుంటే

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ..! 7000 మంది ప్రయాణికులు, 40 రెస్టారెంట్లతో.. టికెట్‌ ధర ఎంతో తెలుసా..?
The World's Biggest Ship
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2024 | 6:06 PM

Share

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ అనగానే ముందుగా టైటానిక్ పేరు గుర్తుకు వస్తుంది అందరికీ. అయితే దానికంటే 5 రెట్లు పెద్ద ఓడ గురించి మీకు తెలుసా?అదే క్రూయిజ్ నౌక.. ఇటీవల ప్రారంభించబడింది. ఇందులో సుమారు 40 రెస్టారెంట్లు, 7100 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 1200 అడుగుల పొడవు, 20 అంతస్తుల పొడవున్న ఈ జెయింట్ షిప్ అన్ని విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంది. ఇప్పటికే జనవరి 27న మయామీ బీచ్ నుండి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ:

ప్రపంచంలోనే అతిపెద్ద నౌక, ఐకాన్ ఆఫ్ ది సీస్. ఇది రాయల్ కరీబియన్ గ్రూపునకు చెందిన భారీ నౌక. ఈ నౌకలో ఒకేసారి 7 వేల 100 మంది ప్రయాణించవచ్చు. ఓడలో 7 స్విమ్మింగ్ పూల్స్, 6 వాటర్ స్లైడ్‌లు ఉన్నాయి. 40 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక బార్, లాంజ్ కూడా ఉంది. ఐకాన్ ఆఫ్ సీస్ నిర్మాణానికి 149 బిలియన్ రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ నౌక జనవరి 27న ఫ్లోరిడాలోని మయామి నుండి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నౌక కరీబియన్ సముద్రంలోని వివిధ దీవులను సందర్శిస్తుంది. మీరు ఈ క్రూయిజ్‌లో ప్రయాణించాలనుకుంటే, మీరు 1.5 లక్షల నుండి 2.24 లక్షల రూపాయల మధ్య చెల్లించాలి.

ఓడ చాలా విలాసవంతమైనది అయినప్పటికీ, చాలా మంది పర్యావరణవేత్తలు దీనిని విమర్శించారు. ఓడ ఎల్‌ఎన్‌జి ఇంధనంతో నడుస్తుంది. కానీ, మీథేన్ వాయువును విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..