87 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం ఆచూకీ చిక్కింది..! ప్రపంచంలోనే మొదటి మహిళా పైలట్‌తో బయల్దేరిన..

సౌత్ కరోలినాకు చెందిన డీప్ సీ విజన్ (DSV) అనే సంస్థ అమేలియా ఇయర్‌హార్ట్ విమానం అదృశ్యమైన పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో చాలా శోధనల తర్వాత ఈ ఫోటోను తీసినట్టుగా తెలిపింది. 39 ఏళ్ల ఇయర్‌హార్ట్, 44 ఏళ్ల నూనన్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంధనం అయిపోయిందని భావించారు. దీని కారణంగా ఆ విమానం హాలండ్ ద్వీపం సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిందని సమాచారం.

87 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం ఆచూకీ చిక్కింది..! ప్రపంచంలోనే మొదటి మహిళా పైలట్‌తో బయల్దేరిన..
Lost Us Amelia Earhart Plan
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 31, 2024 | 7:09 PM

ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాలలో అమేలియా ఇయర్‌హార్ట్ విమానం ఒకటి. ఇది 1937 సంవత్సరంలో తప్పిపోయింది. లోతైన సముద్ర అన్వేషణ సంస్థ ( డీప్ సీ విజన్) ఇటీవల సోనార్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆనవాళ్ల బట్టి..1937 సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమైన, మొదటి మహిళా పైలట్ అమేలియా ఇయర్‌హార్ట్ విమానం యొక్క అవశేషాలుగా గుర్తించినట్టు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి ఓ నివేదిక కూడా విడుదల చేసింది.

సౌత్ కరోలినాకు చెందిన డీప్ సీ విజన్ (DSV) అనే సంస్థ అమేలియా ఇయర్‌హార్ట్ విమానం అదృశ్యమైన పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో చాలా శోధనల తర్వాత ఈ ఫోటోను తీసినట్టుగా తెలిపింది. 39 ఏళ్ల ఇయర్‌హార్ట్, 44 ఏళ్ల నూనన్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంధనం అయిపోయిందని భావించారు. దీని కారణంగా ఆ విమానం హాలండ్ ద్వీపం సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

విడుదలైన సోనార్ చిత్రం చాలా అస్పష్టంగా ఉందని DSV తెలిపారు. ఈ ఫోటోను సైడ్ స్కాన్ సోనార్ సహాయంతో 16,000 అడుగుల లోతులో జలాంతర్గామి తీసింది. ఇయర్‌హార్ట్ తప్పిపోయిన విమానం ఆకారం ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఈ మేరకు DSV చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ రోమన్స్ మాట్లాడుతూ.. ఇయర్‌హార్ట్, నూనన్ విమానాన్ని నీటిపై సేఫ్‌ ల్యాండ్ చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారని, కానీ, వారి ప్రయత్నం ఫలించలేదని తెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు సోనార్ నుండి బయటకు వచ్చిన చిత్రాన్ని చూస్తుంటే అలాంటిదేదో జరిగిందనే అర్థమవుతుందన్నారు. ఇదిలా ఉంటే, పరిశోధనా బృందం పసిఫిక్ మహాసముద్రంలో 13 వేల 500 చదరపు కిలోమీటర్లలో 90 రోజుల పాటు అన్వేషించినట్టుగా వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..