AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: వర్షంలో పిల్లల ఆకలి తీర్చేందుకు తండ్రి ఆరాటం.. కన్నీరు పెట్టిస్తున్న నాన్న ప్రేమ.. హృదయాన్ని కదిలిస్తున్న వీడియో

హృదయ విదారకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక తండ్రి వర్షంలో తడిసిపోతూ తన పిల్లలకు ఆహారం వండుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో కోట్లాది వీక్షణలను పొందింది. కంటికి కనిపించేది తల్లి ప్రేమ అయితే.. మనసుకి తెలిసేది తండ్రి ప్రేమ అని అంటున్నారు. తన పిల్లల బాగు కోసం తాను కష్టపడుతూ కొవ్వొత్తిలా కరిగిపోయే గుణం తండ్రి సొంతం అని అంటున్నారు.

Video Viral: వర్షంలో పిల్లల ఆకలి తీర్చేందుకు తండ్రి ఆరాటం.. కన్నీరు పెట్టిస్తున్న నాన్న ప్రేమ.. హృదయాన్ని కదిలిస్తున్న వీడియో
Father S Love Video
Surya Kala
|

Updated on: Aug 18, 2025 | 9:17 PM

Share

ప్రపంచంలో అందరికీ అన్నీ లభించవు. నేటికీ దేశంలో లక్షలాది మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. వారికి సొంత ఇల్లు, భూమి లేదు, ఆహారం విషయంలో పెట్టింపు ఉండదు. వారు ఏది దొరికితే అది తింటారు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నిద్రపోతారు. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు వారికి నిజమైన సమస్య కలుగుతుంది. వర్షాకాలంలో వారు ఎక్కడికి వెళ్లాలి? అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది ప్రజలను భావోద్వేగానికి గురి చేయడమే కాదు.. దేశంలో పేదరికం ఇంకా గరిష్ట స్థాయిలో ఉందని ఆలోచించేలా చేస్తోంది ఈ వీడియో.

ఈ వీడియోలో ఒక తండ్రి రోడ్డు పక్కన భారీ వర్షంలో తనను, తన పిల్లల కడుపు నింపడానికి ఆహారం వండుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో అతని పిల్లలు పొయ్యి మంట ఆరిపోకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో కింద ఉన్న పొయ్యి మండుతున్నట్లు కనిపిస్తుంది. దానిపై ఒక పాన్ ఉంచి తండ్రి ఆహారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, పిల్లలు తలపై చెక్క పలకను పట్టుకుని వర్షంలో మంట ఆరిపోకుండా చేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఒక పేదవాడు తన కడుపులోని ఆకలి మంటలను ఆర్పడానికి ఏదైనా చేయాలి. వర్షం, తుఫానును భరించాలని అనిపిస్తుంది. ఎవరికైనా..

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గిరిజాప్రసాద్‌దూబే అనే ఐడితో షేర్ చేశారు. దీనిని 90 మిలియన్లకు పైగా వీక్షించారు. 9 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు భిన్నమైన ప్రతిచర్యలు ఇచ్చారు. ఒకరు భావోద్వేగానికి గురై ‘దేవుడు ఒకరోజు వారి కలలన్నింటినీ నెరవేర్చుగాక’ అని వ్యాఖ్యానించగా.. మరొకరు మేము మా జీవితాల గురించి ఫిర్యాదు చేస్తున్నాము.. అయితే వారి జీవితం మా జీవితం కంటే చాలా కష్టంగా ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించుగాక’ అని కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్  వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..