AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్ సిందూర్‌ నుంచి ఆర్సీబీ తొలి ట్రోఫీ వరకు.. మార్కెట్‌లో ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు!

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పండగ ఏదైనా ఉందంటే.. అది వినాయక చవితి మాత్రమే.. ఆగస్ట్‌ రెండో వారం ముగిసిందంటే చాలు దేశంలో వినాయక చవితి సందడి మొదలవుతుంది. విగ్రహ తయారీ దారులు ట్రెండ్‌కు తగ్గట్టు కొత్త వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులను ఆకర్షిస్తుంటారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తయారీ దారులు అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. 2025లో జరిగిన సంఘటనల గుర్తు చేసేలా వెరైటీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఆపరేషన్ సిందూర్‌ నుంచి ఆర్సీబీ తొలి ట్రోఫీ వరకు.. మార్కెట్‌లో ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు!
Rcb Trophy Ganesha
Anand T
| Edited By: |

Updated on: Aug 21, 2025 | 6:14 PM

Share

రాష్ట్రంలో చవితి సందడి మొదలైంది. పల్లె, పట్నం తేడా లేకుండా చిన్నాపెద్దా కలిసి జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. మార్కెట్లలో వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు కొలువుతీరాయి. విగ్రహ తయారీ దారులు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు కొత్త వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులను ఆకర్షిస్తుంటారు. ఈసారి కూడా తయారీ దారులు అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. 2025లో జరిగిన సంఘటనల గుర్తు చేసేలా విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని విజయపుర పట్టణానికి చెందిన రాజగోపాల్ కొత్తగా విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ ఏడాది ఆర్సీబీ కప్‌ గెలిచిన సందర్భంగా RCB కప్పును పట్టుకున్న గణేష్ విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వినాయక విగ్రహాలు కూడా దర్శనమిస్తున్నాయి. సైనికుడి రూపంలో వినాయక విగ్రహాన్ని తయారు చేసి. విగ్రహం ముందు ఒక మిలటరీ వాహనం, దానిపై ఎస్‌-400 క్షిపణిని ఏర్పాటు చేసినట్టు విగ్రహాలను తయారు చేశారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సైనిక చర్యను దేశానికి చాటిచెప్పే ఉద్దేశంలో ఈ వినాయక విగ్రహాలను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా ధూల్‌పేట నుండి పెద్ద మొత్తంలో విగ్రహాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఈ సారి ప్రజలు పర్యావరణ అనుకూల విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఎక్కవగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు మట్టి విగ్రహాల విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి