AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరిగిన ఈ ‘స్టాకింగ్స్‌’ విలువ రూ.14వేలు

ఇప్పటి యువత ఫ్యాషన్‌పై చాలా ఆసక్తిని చూపుతుంది. దీంతో వారి ఇష్టాలను క్యాష్ చేసుకునేందుకు పలు పేరు మోసిన బ్రాండ్‌లు గడ్డి మరకలతో ఫ్యాంట్లు, అక్కడక్కడా చిరిగిన డ్రస్‌లు

చిరిగిన ఈ 'స్టాకింగ్స్‌' విలువ రూ.14వేలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 8:22 AM

Share

Pre ripped stockings: ఇప్పటి యువత ఫ్యాషన్‌పై చాలా ఆసక్తిని చూపుతుంది. దీంతో వారి ఇష్టాలను క్యాష్ చేసుకునేందుకు పలు పేరు మోసిన బ్రాండ్‌లు గడ్డి మరకలతో ఫ్యాంట్లు, అక్కడక్కడా చిరిగిన డ్రస్‌లు అంటూ కొత్త కొత్త డిజైన్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఇక బ్రాండ్‌లు కావడంతో వాటి ధరలు కూడా భారీగానే ఉంటాయి. ఆ మధ్యన గడ్డి మరక అంటినట్లుగా ఉన్న ఓ ఫ్యాంట్‌ని ప్రముఖ గుస్సీ కంపెనీ రూ.88,290కు అమ్మింది. ఇప్పుడు అదే ఇటాలియన్‌ కంపెనీ మరో ఫ్యాషన్‌ని ఇంట్రడ్యూజ్‌ చేసి భారీ రేటును పెట్టింది. ( నాలుగున్నర కోట్ల పన్ను ఎగొట్టావు.. కారు డ్రైవర్‌కి జీఎస్టీ అధికారుల షాక్‌)

అదేంటంటే కాళ్లను అంటిపెట్టుకొని ఉండే పొడవైన వస్త్రం(స్టాకింగ్స్‌) ధరను 190 డాలర్లు(మన కరెన్సీలో రూ.14వేలు)గా పెట్టింది. వాటికి అక్కడక్కడ చిరుగులు ఉండటంతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో పిగిలినట్లుగా ఉంది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డైట్‌ ప్రద అనే నెటిజన్‌.. ఈ స్టాకింగ్స్‌ కోసం 190 డాలర్లు ఎవరైతే ఖర్చు చేస్తున్నారో.. మీరు నిజంగా మంచిగానే ఉన్నారా..? అని కామెంట్‌ పెట్టారు. ఇక ఈ ట్వీట్‌కి నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ రేటుకు చాలానే కొనేయొచ్చు అని, అంత రేటు పెట్టడం ఎందుకు మనమే చింపుకోవచ్చుగా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగా రూ.14వేలు అంటే చాలానే కొనేయొచ్చు మరి. (వైజాగ్‌లో ‘పుష్ప’ షూటింగ్‌.. నెలల గ్యాప్ తరువాత సెట్స్‌పైకి బన్నీ)

Follow Us