Watch Video: ఇది రియల్ లైఫ్ చార్లీ.. పెంపుడు శునకంపై ప్రేమను ఎలా చాటుకున్నాడో చూడండి.
మనుషులకు, శునకాలతో ఉన్న బంధం ఎంతో అద్భుతమైంది. కొందరు పెంపుడు శునకాలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. వాటికి తమ జీవితంలో ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. మొన్నటి మొన్న కన్నడలో తెరకెక్కి తెలుగులోనూ విడుదలైన '777 చార్లి' సినిమా..

మనుషులకు, శునకాలతో ఉన్న బంధం ఎంతో అద్భుతమైంది. కొందరు పెంపుడు శునకాలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. వాటికి తమ జీవితంలో ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. మొన్నటి మొన్న కన్నడలో తెరకెక్కి తెలుగులోనూ విడుదలైన ‘777 చార్లి’ సినిమా మనుషులకు, శునకాలకు మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ఉదాహరణగా నిలిచింది. అనారోగ్యం బారిన పడిన తన పెంపుడు శునకానికి స్నో ఫాల్ చూపించేందుకు ఒక వ్యక్తి చేసిన ప్రయాణమే ఈ సినిమా. భావోద్వేగాలు కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని ఈ సినిమా చాటి చెప్పింది.
ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం. తాజాగా రియల్ లైఫ్ చార్లిలాంటి సన్నివేశం కనిపించింది. అయితే ఇక్కడ శునకానికి ఏం జరగలేదు కానీ. పెంపుడు కుక్కపై యజమానికి ఉన్న ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన వివాహా వేడుకకు హాజరుకావడానికి పెళ్లి మండపానికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో బైక్‌పై తన పెంపుడు శునకాన్ని తీసుకెళ్లడం విశేషం. అంతేకాకుండా కుక్కు కూడా కొత్త డ్రస్ వేయడం మరో విశేషం. పెళ్లి కొడుకుతో దర్జాగా శునకం బండిపై వివాహ వేడుకకు వచ్చింది.
View this post on Instagram
పెళ్లికి హాజరైన వాళ్లు దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెంపుడు శునకంపై యజమాని చూపిస్తున్న ప్రేమకు హ్యాట్సాప్ చెబుతూ లైక్‌లు, షేర్‌లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..