నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు.. పాపం పెళ్లి కూతురు..
తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు సోదరి చేసిన డ్యాన్స్ నెట్టింట హల్‌చల్ చేసింది. ఆ సమయంలో వరుడితో ప్రవర్తించిన తీరు అక్కడి వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక, ఆ క్షణంలో వధువు ముఖం చూడాలి.
ప్రస్తుతం పెళ్లి సీజన్ నడుస్తోంది. వివాహ వేడుక అంటేనే చుట్టాలు, ఫ్రెండ్స్‌తో ఇళ్లంతా సందడి వాతావరణం. మెహంది ఫంక్షన్, హల్దీ డ్యాన్స్‌లు, ఆటలు, పాటలతో పెళ్లి వేడుకలు దుమ్ములేపుతుంటాయి. ఇకపోతే, పెళ్లి సందడిలో వధూవరుల బంధువులు, స్నేహితులు తమ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు సోదరి చేసిన డ్యాన్స్ నెట్టింట హల్‌చల్ చేసింది. ఆ సమయంలో వరుడితో ప్రవర్తించిన తీరు అక్కడి వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక, ఆ క్షణంలో వధువు ముఖం చూడాలి. దెబ్బకు ఆ డ్యాన్స్ చూసి బిత్తరపోయి సైలెంట్‌గా ఉండిపోయింది పాపం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ anmol.hameed అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి వేడుక సందర్భంగా నూతన వధూవరులు వేదికపై సోఫాలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వధువు సోదరి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. బాలీవుడ్ హిట్ సాంగ్ “వో జింకే ఆగే జీ, వో జింకే పేచే జీ..“ సాంగ్‌కు ఆమె స్టైలిష్ గా స్టెప్పులేసింది. అంతటి ఆగలేదు.. వేదికపై ఉన్న వరుడితో కూడా హద్దు మీరి ప్రవర్తించింది. డ్యాన్స్ వేస్తూ వరుడి ఒళ్లో కూర్చోవడం, వరుడి మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకోవడం వంటి పనులు చేసింది. ఆమె డ్యాన్స్‌కు వరుడు సిగ్గుపడిపోయాడు. ఇదంతా చూస్తూ..ఆ పక్కనే కూర్చున్న వధువు కోపంగా చూస్తూ సైలెంట్‌గా ఉండిపోయింది.
View this post on Instagram
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది చూశారు. 79.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి