పసుపు రంగు సీతాఫలం ఎప్పుడైనా చూశారా ??
కడియం నర్సరీలలో పసుపు రంగు సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కడియంకు చెందిన నర్సరీ రైతు దుర్గారావు మూడేళ్ల క్రిందట థాయిలాండ్ నుంచి మొక్కను తెచ్చి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా పెంచి పోషించారు. ప్రస్తుతం అది కాయలు కాసింది. ఓ పండును కోసి చూడగా.. దేశవాళీ సీతాఫలంలాగే ఉంది. తియ్యతియ్యగా… కొంచెం పుల్లగా వెరైటీ రుచితో నోరూరిస్తోంది.
థాయిలాండ్ దేశంలో…అక్కడి నుంచి దుర్గారావు ఎన్నో కొత్తరకం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. మూడేళ్ల క్రితం మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఇప్పుడది కాయలు కాసింది. పళ్లయ్యాయి. చూడ్డానికి పసుపు రంగులో ఉండే ఈ పండు సీతాఫలం రుచినే తలపిస్తుంది. గట్టిగా ఉండటంతో కోసుకొని తినొచ్చు. పై తొక్క దళసరిగా ఉండటం వల్ల దాన్ని వలుచుకొని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని కూడా తినవచ్చు. కడియం నర్సరీల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశ విదేశాలకు చెందిన మొక్కల్ని ఇక్కడకు తీసుకొని వాటిపై ప్రయోగాలు చేస్తూ ఆయా దేశాలలోని వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పెంచుతుంటారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన ఈ మొక్కకు అంటు కట్టి ఇప్పటికే 10 నుంచి 15 మొక్కల్ని అమ్మారు కూడా. వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. మొక్క ధర సుమారు మూడు నాలుగు వందలుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్పత్రిలో నాగుపాము.. లేవలేని రోగులు కూడ పరుగో పరుగు
అదే పనిగా ఫోన్ చూస్తే.. పిచ్చి పట్టడం ఖాయమా ??
TOP 9 ET News: షూటింగ్ లో ప్రమాదం ప్రభాస్‌కు గాయం
Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!
వాళ్లకో రూల్.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

