వాళ్లకో రూల్.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీనిని కేంద్రమంత్రులు, స్థానిక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఖండించారు. అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడ్డారు. కానీ సీనియర్ నటుడు సుమన్ మాత్రం బన్నీ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చాలా తప్పని మండిపడ్డారు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ముమ్మాటికి తప్పే. హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకోవాలని సుమన్ అభిప్రాయపడ్డారు. క్రౌడ్ కు తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక యాక్టర్ గా థియేటర్ కు వెళ్లడం అల్లు అర్జున్ చేసిన తప్పే కాదు అన్నారు. ఈ ఘటన ఒక హెచ్చరిక. దయచేసి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటేనే థియేటర్ యాజమాన్యం.. హీరోలను పిలవాలి అంటూ థియేటర్స్ ఓనర్స్‌కి సలహా ఇచ్చారు. ఒక ప్రాణం పోయింది ఆ బాధ ఆ కుటుంబానికి తీర్చలేనిది. ఒక అభిమాని ప్రాణం కోల్పోయింది. ఇది చాలా బాధగా ఉంది అంటూ సుమన్ ఎమోషనల్ అయ్యారు. గతంలో అనేక ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు. వాళ్లకో రూలు.. అల్లు అర్జున్ కో రూలా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్
టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

