టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముందు వరకు నబీల్ అఫ్రీది పేరు చాలా మందికి తెలియదు. అందుకే హౌస్ లో అతను అడుగుపెట్టినప్పుడు కూడా అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ షో సాగే కొద్దీ నబీల్ బిగ్ బాస్ గేమ్ ను బాగా వంటపట్టించుకున్నాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ వోటింగులో టాప్ లోకి దూసుకెళ్లాడు. తన ఆట, మాట తీరు కూడా బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది.
ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. ఒకానొక దశలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ నబీల్ దేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ సీజన్ చివరకు వచ్చేసరికి నబీల్ పై నెగెటివిటీ పెరిగిపోయింది. ఫలితంగా టైటిల్ రేసులో వెనక పడిపోయాడు. టాప్ -5లో చోటు దక్కించుకున్నా ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే అందుకున్నాడు నబీల్. అకార్డింగ్ టూ ఇన్ సైడ్ టాక్.. వారానికి 2 లక్షలుగా బిగ్ బాస్‌తో నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తమ్మీద 15 వారాలకు గానూ సుమారు 30 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Dec 17, 2024 12:43 PM
వైరల్ వీడియోలు
Latest Videos