పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్
ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న టీవీ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్, దీపిక రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ సీరియల్ తో మానస్ కు ఎంత పేరొచ్చిందో దీపికకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు.
పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటమ్మాయిలా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది దీపిక. ఇక టీవీషోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో వచ్చిరానీ తెలుగుతో దీపిక చేసే సందడి మాములుగా ఉండదు. ఇలా తెలుగు బుల్లితెరపై జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న దీపిక పెళ్లి న్యూస్ ఇప్పుడు నెట్టింట షికారు చేస్తోంది. అదేంటంటే..! దీపిక మెడలో త్వరలోనే పెళ్లిముడి పడనుందట. ఓ సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉందట. అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట. వారు కూడా ఒకే చెప్పారట. దీంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు కావ్య రెడీ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ
వైరల్ వీడియోలు
Latest Videos