Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!
సుమారు 3 నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. సెప్టెంబర్ 01న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు డిసెంబర్ 15తో ఎండ్ కార్డ్ పడింది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా విచ్చేశాడు. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అంటూ అనౌన్స్ చేసి.. బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీతో పాటు.. భారీ ప్రైజ్ మనీ అండ్ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు చెర్రీ.
ఇక పేరుకు కన్నడ నటుడే అయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు నిఖిల్. కంటెస్టెంట్స్ సూటి పోటి మాటలు అన్నా ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే నిఖిల్ కు తిరుగులేకుండా పోయింది. దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడిని బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్ గా భావించారు. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఇక బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 55 లక్షల రూపాయల చెక్కును అందుకున్నాడు నిఖిల్. ఈ మొత్తంతో పాటు బ్రాండ్ న్యూ మారుతీ డిజైర్ కార్‌ను కూడా గెలుచుకున్నాడు ఈ సీరియల్ హీరో. ప్రైజ్ మనీయే కాకుండా… బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు నిఖిల్ వారానికి ఏకంగా రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన మొత్తం పదిహేనువారాలకుగానూ 33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు నిఖిల్ సొంతం చేసుకున్నాడని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాళ్లకో రూల్.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్
పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్
టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

