Viral News: ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..! కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
ఫ్రాన్స్‌కు చెందిన 18ఏళ్ల ఓ యువతి నైట్ క్లబ్‌కు వెళ్లింది. ఆమెను చూసిన ఓ యువకుడు ఆకర్షితుడై ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అంతే..క్షణాల్లో మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఏర్పడింది. బాధిత అమ్మాయి ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్. అసలు విషయంలోకి వెళితే..
ప్రేమగా ఇచ్చే ముద్దు..అవతలి వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్తుందని ఎవరూ ఊహించలేరు. ముద్దు అనేది ప్రేమలో ఆప్యాయతతో కూడిన అనుభూతి. అలాగే మొదటి ముద్దు అనేది జీవితాంతం మరచిపోకూడదనుకునే జీవిత జ్ఞాపకం. కానీ, ఈ మొదటి ముద్దు ఆమెను మృత్యువుకు అతి చేరువ చేసింది. అవును ఇది నిజమే…! ఫ్రాన్స్‌కు చెందిన ఓ యువతి నైట్ క్లబ్‌కు వెళ్లింది. ఆమెను చూసిన ఓ యువకుడు ఆకర్షితుడై ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అంతే..క్షణాల్లో మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని 10 ఏళ్ల తర్వాత బాధిత యువతి తన అనుభవాన్ని చెప్పింది. బాధిత అమ్మాయి ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్. అసలు విషయంలోకి వెళితే..
బాధితురాలి వివరాల మేరకు…అప్పట్లో నాకు 18 సంవత్సరాలు అని చిత్రనిర్మాత ఫోబ్ కాంప్‌బెల్ హారిస్ చెప్పారు. తాను పారిస్‌లోని నైట్ క్లబ్‌కి వెళ్లానని, అక్కడ ఒక అబ్బాయి తనను ముద్దు పెట్టుకున్నాడని చెప్పింది. ముద్దుపెట్టిన కొద్దిసేపటికే తన గొంతు భారంగా మారింది. మెడపై ఎవరో ఇసుక అట్ట వేసినట్లుగా పెద్ద గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత శరీరంలోని అనేక భాగాల్లో వాపు మొదలైంది. వెంటనే తన దగ్గర ఉన్న ఇంజక్షన్ తీసుకున్నానని చెప్పింది. కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అప్పుడు ఎవరో ఎమర్జెన్సీకి కాల్ చేసారు. తనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తాను దాదాపు మరణం అంచున ఉన్నానని చెప్పింది.. ఆ సమయంలో ఆను బతుకుతాననే ఆశ కూడా వదిలేసుకున్నట్టుగా చెప్పింది. ఆ అనుభవం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని నిర్మాత చెప్పారు.
ఫోబ్‌కు అనాఫిలాక్సిస్ అనే అలర్జీ ఉంది. అనాఫిలాక్సిస్ సంభవించినప్పుడు బాధితులు నిమిషాల వ్యవధిలోనే మరణానికి చాలా దగ్గరగా వెళ్తారు. వ్యాధి సంభవించిన వెంటనే, అనాఫిలాక్సిస్ షాక్ నిమిషాల్లో సంభవిస్తుంది. దీనిలో శరీరంలోని చాలా భాగాలు ఉబ్బడం ప్రారంభమవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, గొంతు, తొడలలో దురద, తీవ్రమైన తల తిరగడం, తీవ్రమైన దగ్గు చివరకు ప్రాణ నష్టం సంభవిస్తుందని వైద్యులు వివరించారు. అయితే, అనాఫిలాక్సిస్ అలర్జీలు అనేక కారణాల వల్ల కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు.
కొన్ని విషయాలు అనాఫిలాక్సిస్ అలెర్జీలకు కారణమవుతాయి. ప్రతి ఒక్కరూ వివిధ రకాల ఆహారాలకు అలెర్జీని కలిగి ఉంటారు. ఇందులో పాలు, గుడ్లు, చేపలు, గోధుమలు, సోయాబీన్స్, వేరుశెనగలు, గింజలు మొదలైనవి కూడా ఉండవచ్చు. ఫోబ్‌కు నట్స్ అంటే ఎలర్జీ. ఇందులో వేరుశెనగ, బాదం మొదలైనవి ఉండవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి