Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. ఏ వస్తువు దొంగతనం చేయాలో కూడా తెలియదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
దొంగలకు ఉండే తెలివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కన్ను పడిందంటే.. ఎదుటి మనుషులకు తెలియకుండా కాజేస్తుంటారు
దొంగలకు ఉండే తెలివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కన్ను పడిందంటే.. ఎదుటి మనుషులకు తెలియకుండా కాజేస్తుంటారు. ఇక ఓ ఇంట్లో చోరీ చేస్తే.. ఆ దొంగలకు పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. ఎక్కడున్న పట్టేస్తారు. అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పోలీసుల కంటే ముందే దొంగలను సీసీ టీవీ ఫుటేజ్ పట్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న దొంగతనాలు.. సీసీ టీవీలో క్లారిటీగా రికార్డ్ అవ్వడం.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడం చూస్తు్న్నాం. అయితే అందులో కొన్ని చోరీలు చూస్తే కాస్త భయంగానూ.. ఆశ్చర్యంగానూ కనిపింటాయి. మరికొన్ని మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇక అసలు దొంగలకు ఏ వస్తువు దొంగిలించాలి.. ఏది కాదు.. అనే విషయంపై పూర్తి క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ మహిళ దొంగకు మాత్రం దొంగతనం చేయడం మొదటి సారి కాబోలు.. అందుకే ఓ వస్తువు చేయాలి.. ఎలా చేయాలనేది బొద్దిగా తెలిసినట్టు లేదు. ఆమె దొంగతనం చేయడానికి ప్రయత్నించిన తీరు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక వివరాల్లోకెళితే.. ఐరన్ వస్తువులకు సంబంధించిన ఓ పెద్ద స్టోర్లోకి వెళ్లిన ఓ మహిళ పెద్ద రంపం దొంగిలించడానికి ప్రయత్నించింది. అయితే ఆ వస్తువు చోరీ చేయడం ఎవరికీ కనిపించకూడదని ఆ రంపాన్ని దాచిపెట్టడానికి నానారకాలుగా ప్రయత్నించింది. ఇక ఎంతసేపు ప్రయత్నించినా.. ఆ రంపంను దాచలేకపోయింది. అయినా.. కానీ.. తాను వేసుకున్న జాకెట్ వెనక దాచి కనిపించకుండా ఉండేందుకు తన భుజాలకు బ్యాగ్ వేసుకుని వెళ్లిపోయింది. అయితే ఆ మహిళ.. రంపాన్ని దాచేందుకు ప్రయత్నించిన తీరు మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Also Read: Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ.
Pooja Hegde: లక్కీ ఛాన్స్ అందుకున్న పూజా హెగ్డే ?.. భవదీయుడు సరసన బుట్టబొమ్మ..