Bending stone Video: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..! భవన నిర్మాణాలకు మంచివంటున్న శాస్త్రవేత్తలు.. (వీడియో)

Bending stone Video: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..! భవన నిర్మాణాలకు మంచివంటున్న శాస్త్రవేత్తలు.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 09, 2021 | 5:50 PM

నీటిలో తేలే రాళ్లను మనం చూసాం.. అదేనండి రామాయణ కాలంలో రామసేతు నిర్మాణానికి హనుమంతుడు, వానర సైన్యం నీటిలో రాళ్లను వెయ్యగానే అవి నీటిలో తేలి వారధి నిర్మాణానికి రాళ్లు కూడా సహకరించాయని చదువుకున్నాం కదా..


నీటిలో తేలే రాళ్లను మనం చూసాం.. అదేనండి రామాయణ కాలంలో రామసేతు నిర్మాణానికి హనుమంతుడు, వానర సైన్యం నీటిలో రాళ్లను వెయ్యగానే అవి నీటిలో తేలి వారధి నిర్మాణానికి రాళ్లు కూడా సహకరించాయని చదువుకున్నాం కదా.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రాళ్లు ఎటు కావాలంటే అటు వంగుతున్నాయి. దీని వెనుక ఉన్న రహస్యం అయితే తెలియలేదు కానీ.. భవన నిర్మాణాలకి ఈ రాళ్లు చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు శాస్త్రవేత్తలు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న రాయి ఎటు వంచితే అటు వంగుతోంది. దీని పేరు.. ఇటాకోలమైట్‌. ఇది పోరస్‌ ఇసుకరాయి జాతికి చెందినది. సాధారణ రాళ్ల మాదిరిగానే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. కానీ ప్రత్యేకత ఏంటంటే.. ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్‌ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం స్వతహాగా వస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్‌ సైజ్‌లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతు చిక్కలేదు. ఇప్పడు ఆ పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రాళ్లు వంగడం వెనుక అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వెయిట్‌ చెయ్యక తప్పదు.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Published on: Nov 09, 2021 03:12 PM