Watch Video: కతర్నాక్ హెయిర్ కటింగ్ కావాలన్నాడు.. కట్ చేస్తే ఆస్పత్రిలో కళ్లు తేలేశాడు.. షాకింగ్ వీడియో..
కేశాలంకరణ వ్యక్తి అందాన్ని మరింత పెంచుతుంది. ఆడవారైనా, మగవారైనా.. తమ జుట్టును ఎంతో అందంగా మలుచుకుంటారు. గతంలో అంటే కొప్పులు వేయడం,
కేశాలంకరణ వ్యక్తి అందాన్ని మరింత పెంచుతుంది. ఆడవారైనా, మగవారైనా.. తమ జుట్టును ఎంతో అందంగా మలుచుకుంటారు. గతంలో అంటే కొప్పులు వేయడం, సాదాసీదాగా ఉండేవారు. కానీ, కాలు మారుతున్నా కొద్ది కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ వస్తున్నాయి. ఫ్యాషన్‌కు అలవాటు పడిన జనాలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముఖ్యంగా యువత న్యూలుక్ హెయిర్ స్టైల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్‌లో కూడా రకరకాల పద్ధతలు, న్యూ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా సెలూన్‌లు సైతం పలు రకాల హెయిర్ కట్‌లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. షాట్ హెయిర్ కట్ అని.. ఫేడ్, బజ్, సైడ్ కట్, ఫ్లాట్ కట్ ఇలా రకరకాలుగా యువత తమ జుట్టును స్టైల్‌గా కట్ చేయించుకుంటుంటారు.
అయితే, ప్రస్తుతం ‘ఫైర్ హెయిర్‌కట్’ అనేది ట్రెండ్ంగ్‌లో ఉంది. ఈ ఫైర్ హెయిర్ కట్ చేయించుకోవడం పెద్ద సాహసమే అని చెప్పాలి. జుట్టుకు ఒక రకమైన క్రీమ్ అప్లై చేసి, దానికి మంటను అంటిస్తారు. అలా జుట్టు మండుతుండగా, మనకు కావాల్సిన స్టైల్‌లో హెయిర్ సెట్ చేస్తారు. ఈ స్టైలీష్ హెయిర్ కంటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అని చెప్పాలి. ఎందుకంటే.. ఇది ఎంత స్టైలీష్ హెయిర్ కటింగో.. అంతకంటే డేంజర్. ఏమాత్రం తేడా కొట్టినా తీవ్ర గాయాలు తప్పవు. తాజాగా వీడియోలో ఇదే కనిపిస్తుంది.
ఈ పద్ధతిలో హెయిర్ కటింగ్ చేయించుకోబోయి గాయాలపాలయ్యాడు ఓ యువకుడు. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా వాపి పట్టణంలోని భడక్‌మోరా ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ ఘట. భడక్ మోరా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ‘ఫైర్ హెయిర్ కట్’ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అక్కడ ఫైర్ హెయిర్ కట్ చేయించుకుంటుండగా.. అతి ఫెయిల్ అయ్యింది. తలకు పెద్ద మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో యువకుడి మెడ, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. చివరకు మంటలను ఆర్పిన స్థానికులు.. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ફાયર હેરકટિંગ કરાવતા પહેલા જોઈ લો આ વિડિયો..! વાપીના યુવકને વાળ સાથે અખતરો કરવો ભારે પડ્યો#Vapi #FireHairCutting #Viral #CGnews pic.twitter.com/Dg4bIJ0Ihs
— ConnectGujarat (@ConnectGujarat) October 27, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..