మ్యాన్ హోల్ కవర్స్ రౌండ్ షేప్‌లోనే ఎందుకు ఉంటాయి.? దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే..
మన వ్యవహారిక జీవితంలో ఉపయోగించే ప్రతీ ఒక్క వస్తువు, మనం చేసే ప్రతీ పని కచ్చితంగా సైన్స్‌తో ముడిపడి ఉంటుంది. భౌతిక సూత్రాలకు అనుగుణంగా అన్ని పనిచేస్తుంటాయి. అందుకే మనిషి జీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చూడడానికి..
మన వ్యవహారిక జీవితంలో ఉపయోగించే ప్రతీ ఒక్క వస్తువు, మనం చేసే ప్రతీ పని కచ్చితంగా సైన్స్‌తో ముడిపడి ఉంటుంది. భౌతిక సూత్రాలకు అనుగుణంగా అన్ని పనిచేస్తుంటాయి. అందుకే మనిషి జీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చూడడానికి మనకు సాధారణంగా కనిపించే అంశాల వెనకాల ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది. అందులో ఒకటి మ్యాన్ హోల్స్‌పై ఉండే కవర్స్. సాధారణ భాషలో చెప్పాలంటే మ్యాన్ హోల్ క్యాప్స్.
మీరు ఎక్కడ గమనించినా మ్యాన్ హోల్ క్యాప్స్ ఎక్కువ శాతం రౌండ్ షేప్‌లో ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రమే స్క్వేర్ షేప్‌లో దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇళ్లలో ఉండే చిన్న చిన్న హోల్స్‌కి మాత్రమే స్క్వేర్ (దీర్ఘచతురస్రాకరం) షేప్‌లో ఉండే క్యాప్‌లను ఉపయోగిస్తారు. అయితే పెద్ద పెద్ద నాలాలపై ఉండే మ్యాన్ హోల్స్‌కి రౌండ్ షేప్‌లో ఉండే క్యాప్స్‌నే వాడతారు. ఇంతకీ రౌండ్ షేప్ క్యాప్‌లనే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
సాధరాణంగా స్క్వేర్ షేప్‌లో ఉండే క్యాప్‌ను హోల్‌పై సరిగ్గా అమర్చకపోతే సదరు క్యాప్ మ్యాన్ హోల్‌లో పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే రౌండ్ షేప్‌లో ఉండే క్యాప్ విషయంలో ఇలా జరగదు. పొరపాటున మిస్ అయినా మ్యాన్ హోల్‌లో పడకుండా క్యాప్ చివర్లు మ్యాన్ హోల్ చివర్లకు అడ్డుపడుతుంది. మ్యాన్‌హోల్ క్యాప్ రౌండ్ షేప్‌లోనే ఉండడానికి అసలు కారణం ఇదే.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..