Viral Video: కేర్ టేకర్‌ని కొట్టడంతో ఆగ్రహించిన గజరాజు.. తర్వాత ఏం చేసిందంటే..?
Viral Video: జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని

Viral Video: జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇలాంటి వీడియోలని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్స్, కామెంట్స్‌తో హుషారెత్తిస్తారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జంతువుల ప్రేమ ఈ విధంగా ఉంటుందా.. అని షాక్ అవుతున్నారు. ఇంతకీ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏనుగు కేర్ టేకర్‌గా ఉండే వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టారీతిన కొట్టడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ విషయాన్ని కొంచెం దూరంలో ఉన్న ఏనుగు గమనించి కేర్‌టేకర్ కాపాడటానికి పరుగెత్తుకుంటూ వస్తుంది. వేగంగా వస్తున్న ఏనుగుని చూసి కేర్‌టేకర్‌ని కొడుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. అప్పుడు ఏనుగు.. దెబ్బలు తిన్న కేర్‌టేకర్ చుట్టూ గుండ్రంగా యజమానిపై తన ప్రేమని వ్యక్తం చేస్తుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పెంపుడు జంతువులు యజమానిని ఇంతలా ఆరాధిస్తాయా అనడానికి ఈ ఒక్క వీడియో చాలు. ఈ వీడియోని ఒక నె టిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 16 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో చాలా మంది వీడియోపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలపండి.
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి