AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భార్య సౌందర్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త పాండి చేసిన పనికి అంతా షాక్..

భార్యను కాటువేసిన కొండచిలువను భర్త ప్రాణంతో పట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంఘటన పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది. పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన ఈ ఘటనపై అందరిని ఆశ్చర్యానికి గురి చోటుచేసుకుంది.

Viral News: భార్య సౌందర్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త పాండి చేసిన పనికి అంతా షాక్..
Pudukkottai Man
Follow us
Sanjay Kasula

|

Updated on: May 20, 2022 | 3:44 PM

సాధారణంగా పాము కరిచిందని తెలిస్తే మరుసటి నిముషం పామును తరిమి కొట్టి కొడతారు.. అంతేకాదు ఆ పామును చంపేస్తారు. అయితే కాటుకు గురైన పామును, అతని భార్యను రక్షించిన అపూర్వమైన ఘటన తమిళనాడులో(Tamil Nadu) జరిగింది. భార్యను కాటువేసిన కొండచిలువను భర్త ప్రాణంతో పట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంఘటన పుదుక్కొట్టై జిల్లాలో(Pudukottai District) జరిగింది. పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన ఈ ఘటనపై అందరిని ఆశ్చర్యానికి గురి చోటుచేసుకుంది. పుదుక్కోట్టై జిల్లా తిరుమయం సమీపంలోని మేలతురువాసపురానికి చెందిన పాండి అతని భార్య సౌందర్య ఇంటి ముందు పేర్చిన కట్టెలు తీయడానికి వెళ్లింది. దీంతో భార్య కేకలు విన్న భర్త పాండి పరుగున వచ్చి భార్యను రక్షించాడు. అనంతరం తాటి చెట్టును పగులగొట్టి అందులోని కొండ పామును పట్టుకుని ద్విచక్ర వాహనంపై వెళ్లి కాటుకు గురైన పామును వైద్యుడికి చూపించి భార్యను చికిత్స నిమిత్తం తిరుమయం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

అంతేకాకుండా పామును వదలకుండా కాపాడాలనే ఉద్దేశ్యంతో పామును తగిన చోట చేర్చాలని పాండి అటవీశాఖకు సమాచారం అందించి.. పట్టుకున్న పామును తిరుమయం అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం అటవీశాఖ అధికారులు కొండపామును పూలన్‌కురిచ్చి సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్టులోకి వదిలిపెట్టారు. 

పాముకాటుకు గురైన భార్యను, కొండచిలువ పామును ఎంతో బాధ్యతగా ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన భర్త పాండి సకల జీవరాశిని గౌరవిస్తూ చేసిన పనిని చూసి జనం ఆశ్చర్యపోయారు. సకల ప్రాణులను ఎంతో బాధ్యతగా గౌరవించి తన భార్యను కాపాడడమే కాకుండా కొండచిలువ పామును సరైన స్థానంలో వదలిపెట్టిన పాండి పాత్ర అందిరిని  ఆకట్టుకుంటుంది. మరి కాటుకు గురైన పాముతో భార్యను ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన భర్త పాండి చర్యకు ప్రజానీకం ఒకింత అవాక్కయిందనడంలో ఆశ్చర్యం లేదు.