Viral Video: స్టంట్ అదిరిపోయింది.. వెన్ను పగిలిపోయింది.. అస్సలు ట్రై చేయకండి..!
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించగా మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగించగా మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా చూస్తారు. లైక్స్, కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి చేసిన పనికి నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఉంటుంది. ఇంతకీ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి భయంకరమైన స్టంట్ చేయడం మనం గమనించవచ్చు. ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి మూడు పల్టీలు కొడుతూ ఇసుక దిబ్బపై పడుతుంది. వాస్తవానికి ఈ స్టంట్ సరిగ్గా చేయలేదు. ఎందుకంటే చివరికి ఆమె కాళ్లపై నిలబడాలి. కానీ అలా జరగలేదు. వెన్నుపై పడటంతో చాలా దెబ్బతగులుతుంది. అయినప్పటికీ ఆమె కెమెరాకి ఫోజులివ్వడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్లరూపంలో తెలుపుతున్నారు. ఒక నెటిజన్.. అమ్మాయికి పర్ఫెక్ట్ బ్యాక్ మసాజ్ వచ్చింది’ అని రాశారు. ఈ వీడియో అప్‌లోడ్ అయినప్పటి నుంచి దాదాపు 3 వేల మంది లైక్ చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలపండి.
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి